Product SiteDocumentation Site

Red Hat Enterprise Linux 7

7.1 విడుదల నోట్స్

Red Hat Enterprise Linux 7 విడుదల నోట్స్

Red Hat వినియోగదారి కాంటెంట్ సేవలు

చట్టబద్ద నోటీసు

Copyright © 2015 Red Hat, Inc.
The text of and illustrations in this document are licensed by Red Hat under a Creative Commons Attribution–Share Alike 3.0 Unported license ("CC-BY-SA"). An explanation of CC-BY-SA is available at http://creativecommons.org/licenses/by-sa/3.0/. In accordance with CC-BY-SA, if you distribute this document or an adaptation of it, you must provide the URL for the original version.
Red Hat, as the licensor of this document, waives the right to enforce, and agrees not to assert, Section 4d of CC-BY-SA to the fullest extent permitted by applicable law.
Red Hat, Red Hat Enterprise Linux, the Shadowman logo, JBoss, MetaMatrix, Fedora, the Infinity Logo, and RHCE are trademarks of Red Hat, Inc., registered in the United States and other countries.
Linux® is the registered trademark of Linus Torvalds in the United States and other countries.
Java® is a registered trademark of Oracle and/or its affiliates.
XFS® is a trademark of Silicon Graphics International Corp. or its subsidiaries in the United States and/or other countries.
MySQL® is a registered trademark of MySQL AB in the United States, the European Union and other countries.
All other trademarks are the property of their respective owners.


1801 Varsity Drive
RaleighNC 27606-2072 USA
Phone: +1 919 754 3700
Phone: 888 733 4281
Fax: +1 919 754 3701

సంక్షిప్తము

Red Hat Enterprise Linux 7.1 నందు చేసిన విస్తరింపులు మరియు ముఖ్య మార్పుల గురించి మరియు 7.1 విడుదల నందలి తెలిసిన సమస్యల గురించి విడుదల నోట్స్ వివరించును. Red Hat Enterprise Linux 6 మరియు 7 మద్యని మార్పుల గురించి వివరణాత్మక సమాచారం కొరకు, మైగ్రేషన్ ప్లానింగ్ గైడ్ చూడండి..
గుర్తింపులు
Red Hat Enterprise Linux 7 ను పరీక్షించుటలో స్టెర్లింగ్ ఎలెగ్జాండర్ మరియు మైఖేల్ ఎవ్‌రెటే చేసిన విశేషమైన కృషిని Red Hat గ్లోబల్ సపోర్ట్ సర్వీసెస్ గుర్తిస్తోంది.
ముందుమాట
I. కొత్త విశేషణాలు
1. ఆకృతులు
2. సంస్థాపన మరియు బూటింగ్
3. నిల్వ
4. ఫైల్ సిస్టమ్స్
5. కెర్నల్
6. వర్చ్యులైజేషన్
7. క్లస్టరింగ్
8. కంపైలర్ మరియు సాధనములు
9. నెట్వర్కింగ్
10. డాకర్ ఫార్మాట్‌తో లైనక్స్ కంటైనర్స్
11. ధృవీకరణ మరియు ఇంటరాపరబిలిటి
12. రక్షణ
13. డెస్క్‌టాప్
14. మద్దతు మరియు నిర్వహణ
15. Red Hat సాఫ్ట్‌వేర్ సంకలనాలు
II. పరికర డ్రైవర్లు
16. నిల్వ డ్రైవర్ నవీకరణలు
17. నెట్వర్క్ డ్రైవర్ నవీకరణలు
18. గ్రాఫిక్స్ డ్రైవర్ నవీకరణలు
A. పునఃపరిశీలన చరిత్ర

ముందుమాట

Red Hat Enterprise Linux చిన్న విడుదలలు అనునవి విడివిడి పొడిగింపుల, రక్షణ మరియు బగ్ పరిష్కార యెర్రాటా యొక్క సంకలనం. Red Hat Enterprise Linux 7.1 విడుదల నోట్స్ అనునది Red Hat Enterprise Linux7 ఆపరేటింగ్ సిస్టమ్‌కు మరియు దానితోటి అనువర్తనములకు ఈ చిన్న విడుదలనందు చేసిన పెద్ద మార్పులను పత్రికీకరణ చేయును. అదనంగా, Red Hat Enterprise Linux 7.1 విడుదల నోట్స్ అనేది Red Hat Enterprise Linux 7.1 నందలి తెలిసిన సమస్యలను వివరించును.

ముఖ్యమైన

ఆన్‌లైన్ Red Hat Enterprise Linux 7.1 విడుదల నోట్స్, ఆన్‌లైన్ నందు ఇక్కడ వున్నవి, ఖచ్చితమైనవిగా, సరికొత్త వర్షన్‌గా పరిగణించాలి. విడదలకు సంబందించి ప్రశ్నలువున్న వినియోగదారులు వారి Red Hat Enterprise Linux వర్షన్‌కు చెందిన ఆన్‌లైన్ విడుదల నోట్స్ సంప్రదించమని సూచించడమైంది.

తెలిసిన సమస్యలు

తెలిసిన సమస్యల వివరణకు, Red Hat Enterprise Linux 7.1 విడుదల నోట్స్ ఆంగ్ల వర్షన్ చూడండి.
Red Hat Enterprise Linux లైఫ్ సైకిల్ గురించిన సమాచారం మీకు కావలెనా, https://access.redhat.com/support/policy/updates/errata/ చూడండి.

భాగము I. కొత్త విశేషణాలు

అధ్యాయము 1. ఆకృతులు

Red Hat Enterprise Linux  7.1 అనునది కింది ఆకృతులపై ఒకే కిట్‌గా అందుబాటులో ఉంది [1]:
  • 64-బిట్ AMD
  • 64-బిట్ Intel
  • IBM POWER7 మరియు POWER8 (big endian)
  • IBM POWER8 (little endian) [2]
  • IBM System z [3]
ఈ విడుదల నందు, Red Hat సేవికలు మరియు వ్యవస్థల కొరకు కలిసికట్టుగా మెరుగుదలలు తెచ్చును, అలాగే మొత్తం Red Hat ఓపెన్ సోర్స్ అనుభూతిపై కూడా.

1.1. POWER, Little Endian కొరకు Red Hat Enterprise Linux

Red Hat Enterprise Linux 7.1 అనేది little endian తొడ్పాటును IBM Power Systems servers పైన IBM POWER8 ప్రోసెసర్స్ ఉపయోగించి అందించును. గతంలో Red Hat Enterprise Linux 7 నందు, big endian రకం మాత్రమే IBM Power Systems కొరకు అందించబడెను. 64-bit Intel సారూప్య వ్యవస్థలు (x86_64) మరియు IBM Power Systems మధ్యన అనువర్తనాల పోర్టబిలిటీను మెరుగుపరచుటపై little endian on POWER8-based సేవికల తోడ్పాటు దృష్టిపెడుతోంది.
  • little endian రీతినందు IBM Power Systems సేవికలపై Red Hat Enterprise Linux సంస్థాపించుట కొరకు ప్రత్యేక సంస్థాపనా మాధ్యమం అందించును. Red Hat వినియోగదారి పోర్టల్ దింపుకోలు విభాగంనుండి ఈ మాధ్యమం ఆందుబాటలో ఉంటుంది.
  • POWER, little endian కొరకు Red Hat Enterprise Linux తో IBM POWER8 ప్రోసెసర్-ఆధారిత సేవికలు మాత్రమే తోడ్పాటునిచ్చును.
  • ప్రస్తుతం, POWER, little endian కొరకు Red Hat Enterprise Linux అనేది కేవలం Red Hat Enteprise Virtualization for Power కిందన KVM గెస్ట్ వలె తోడ్పాటునిచ్చును.
  • GRUB2 బూట్ లోడర్ అనేది సంస్థాపనా మాధ్యమం పైన మరియు నెట్వర్క్ బూట్ కొరకు ఉపయోగించెను. GRUB2 ఉపయోగించి IBM Power Systems క్లైంట్స్ కొరకు నెట్వర్క్ బూట్ సేవిక అమర్చే సూచనలతో సంస్థాపనా మార్గదర్శిని నవీకరించబడెను..
  • Red Hat Enterprise Linux యొక్క little endian మరియు big endian రెండు రకాలకు IBM Power Systems కొరకు అన్ని సాఫ్ట్‌వేర్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
  • Red Hat Enterprise Linux for POWER, little endian కొరకు నిర్మించిన ప్యాకేజీలు, ppc64le ఆర్కిటెక్చర్ కోడ్ ఉపయోగించును - ఉదాహరణకు, gcc-4.8.3-9.ael7b.ppc64le.rpm.


[1] Red Hat Enterprise Linux  7.1 సంస్థాపన అనునది 64-బిట్ హార్డువేర్ పైన మాత్రమే తోడ్పాటునిచ్చునని గమనించండి. Red Hat Enterprise Linux  7.1 అనేది 32-బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ నడుపగలదు, Red Hat Enterprise Linux వర్షన్లతో సహా, ఒక వర్చువల్ మిషన్ వలె.
[2] Red Hat Enterprise Linux 7.1 (little endian) ప్రస్తుతం KVM గెస్టుగా మాత్రమే Red Hat Enteprise Virtualization for Power మరియు PowerVM హైపర్వజర్ల కిందన తొడ్పాటునిచ్చును.
[3] Red Hat Enterprise Linux 7.1 అనేది IBM zEnterprise 196 హార్డ్‌వేర్ లేదా తరువాతి వాటికి తోడ్పాటునిచ్చునని గమనించండి; IBM System z10 మెయిన్‌ఫ్రేమ్ సిస్టమ్స్ ఇకపై తోడ్పాటునీయబడవు మరియు Red Hat Enterprise Linux 7.1 బూట్ చేయబోదు.

అధ్యాయము 2. సంస్థాపన మరియు బూటింగ్

2.1. సంస్థాపకి

Red Hat Enterprise Linux సంస్థాపకి, అనకొండ, Red Hat Enterprise Linux 7.1 సంస్థాపనా ప్రోసెస్‌ను మెరుగుపరచుటకు తిరిగిరూపొందించబడంది మరియు విస్తరించబడింది.

ఇంటర్ఫేస్

  • సంస్థాపననందు కెర్నల్ క్రాష్ డంపింగ్ మెకానిజం Kdump ఆకృతీకరించుటకు గ్రాఫికల్ ఇన్‌స్టాలర్ ఇంటర్ఫేస్ ఇప్పుడు అదనపు తెరను కలిగివుంది. గతంలో, ఇది సంస్థాపన తరువాత firstboot ఉపయోగించి ఆకృతీకరించబడేది, అది గ్రాఫికల్ ఇంటర్ఫేస్ లేకుండా సాధ్యమయ్యేదికాదు. ఇప్పుడు గ్రాఫికల్ ఎన్విరాన్మెంట్ లేని వ్యవస్థలపై కూడా Kdump ను సంస్థాపనలో భాగంగా ఆకృతీకరించవచ్చు. కొత్త తెరను సంస్థాపకి మెనూనుండి పొందవచ్చు (Installation Summary).
    కొత్త Kdump తెర
    The new Kdump screen.

    మూర్తి 2.1. కొత్త Kdump తెర


  • వాడుకరి సౌలభ్యం కొరకు మానవీయ విభజనీకరణ తెర తిరిగిరూపొందించబడింది. కొన్ని నియంత్రికలు ఆ తెరపైన వేరే స్థానానికి కదల్చబడెను.
    తిరిగిరూపొందించిన మానవీయ విభజనీకరణ తెర
    The new Manual Partitioning screen.

    మూర్తి 2.2. తిరిగిరూపొందించిన మానవీయ విభజనీకరణ తెర


  • మీరు ఇప్పుడు నెట్వర్క్ బ్రిడ్జ్‌ను సంస్థాపకి యొక్క Network & Hostname తెరపైన ఆకృతీకరించవచ్చు. అలా చేయుటకు, ఇంటర్ఫేస్ జాబితా కిందని + నొక్కి, మెనూనుండి Bridge ఎంపికచేయుము, మరియు బ్రిడ్జ్‌ను Editing bridge connection డైలాగ్ నందు ఆకృతీకరించుము. ఈ డైలాగ్ NetworkManager చేత అందించబడును మరియు Red Hat Enterprise Linux 7.1 Networking Guide వద్ద పూర్తిగా పత్రీకరణ చేయబడెను.
    బ్రిడ్జ్ ఆకృతీకరణ కొరకు చాలా కిక్‌స్టార్ట్ ఐచ్చికాలు కూడా జతచేయబడెను. వివరాలకు కింద చూడండి.
  • లాగ్స్ ప్రదర్శించుటకు సంస్థాపిక ఇకపై బహుళ ప్రదర్శనలను ఉపయోగించదు. బదులుగా, అన్ని లాగ్స్ tmux పేన్ నందు వర్చ్యువల్ కన్సోల్ 1 (tty1). సంస్థాపననందు లాగ్స్ ఏక్సెస్ చేయుటకు, Ctrl+Alt+F1 వత్తి tmux కు మారండి, మరియు విండోల మధ్య మారుటకు Ctrl+b X (X ను కావలసిన విండో నంబర్‌తో ప్రతిక్షేపించండి).
    గ్రాఫికల్ ఇంటర్ఫేస్‌కు మారుటకు, Ctrl+Alt+F6 వత్తండి.
  • Anaconda కొరకు కమాండ్-లైన్ ఇంటర్ఫేస్ ఇప్పుడు పూర్తి సహాయం అందించును. దాన్ని చూడుటకు, anaconda -h ఆదేశాన్ని వ్యవస్థపైన anaconda ప్యాకేజీతో సంస్థాపించండి. సంస్థాపిత వ్యవస్థపైన సంస్థాపికను నడుపుటకు కమాండ్-లైన్ ఇంటర్ఫేస్ మిమ్ములను అనుమతించును, అది డిస్క్ ఇమేజ్ సంస్థాపనలకు ఉపయోగకరం.

కిక్‌స్టార్ట్ ఆదేశాలు మరియు ఐచ్ఛికాలు

  • logvol ఆదేశం కొత్త ఐచ్చికం కలిగివుంది: --profile=. థిన్ లాజికల్ వాల్యూమ్‌తో ఉపయోగించుటకు ఈ ఐచ్చికం ఉపయోగించి ఆకృతీకరణ ప్రొఫైల్ తెలుపండి. ఉపయోగించితే కనుక, ఆపేరు మెటాడేటా నందు లాజికల్ వాల్యూమ్ కొరకు చేర్చబడును.
    అప్రమేయంగా, అందుబాటులోని ప్రొఫైళ్ళు default మరియు thin-performance మరియు /etc/lvm/profile డైరెక్టరీనందు నిర్వచించెను. అదనపు సమాచారం కొరకు lvm(8) man పేజీ చూడండి.
  • --autoscreenshot ఐచ్చికం autostep కిక్‌స్టార్ట్ ఆదేశం పరిష్కరించబడెను, మరియు ఇప్పుడు తెరపట్టును సరిగ్గా /tmp/anaconda-screenshots డైరెక్టరీనకు నకలుతీయును. సంస్థాపన పూర్తవగానే, ఈ తెరపట్లు /root/anaconda-screenshots కు కదల్చబడును.
  • liveimg కమాండ్ ఇప్పుడు సంస్థాపనలను టార్ ఫైల్ నుండి మరియు డిస్కు ఇమేజ్‌లనుండి తోడ్పాటునిచ్చును. టార్ ఆర్కైవ్ తప్పక సంస్థాపనా మాధ్యమం యొక్క root ఫైల్ సిస్టమ్ కలిగివుండాలి, మరియు ఫైల్ పేరు తప్పక .tar, .tbz, .tgz, .txz, .tar.bz2, .tar.gz, లేదా .tar.xz తో ముగియాలి.
  • చాలా కొత్త ఐచ్చికాలు network ఆదేశానికి చేర్చబడెను నెట్వర్క్ బ్రిడ్జ్‌లు ఆకృతీకరించుటకు. ఆ ఐచ్చికాలు:
    • --bridgeslaves=: ఈ ఐచ్చికం ఉపయోగించినప్పుడు, --device= ఉపయోగించి తెలిపిన నెట్వర్క్ పేరుతో నెట్వర్క్ బ్రిడ్జ్ సృష్టించబడును మరియు --bridgeslaves= ఐచ్చికం నందు నిర్వచించిన పరికరాలు బ్రిడ్జ్‌కు జతచేయబడును: ఉదాహరణకు:
      network --device=bridge0 --bridgeslaves=em1
    • --bridgeopts=: బ్రిడ్జ్ ఇంటర్ఫేస్ కొరకు కామాతోవేరుచేసిన పారామితుల జాబితా. అందుబాటులోని విలువలు stp, priority, forward-delay, hello-time, max-age, మరియు ageing-time. ఈ పారామితుల గురించి సమాచారం కొరకు, nm-settings(5) man పేజీ చూడండి.
  • autopart ఆదేశం కొత్త ఐచ్చికం కలిగివుంది, --fstype. ఈ ఐచ్చికం మిమ్ములను అప్రమేయ ఫైల్ సిస్టమ్ రకంను మార్చుటకు అనుమతించును (xfs) కిక్‌స్టార్ట్ ఫైల్ నందు స్వయంచాలక విభజనీకరణను ఉపయోగించునప్పుడు.
  • ఉత్తమ డాకర్ తోడ్పాటు కొరకు చాలా కొత్త విశేషణాలు జతచేయబడెను. అవి:
    • repo --install: ఈ కొత్త ఐచ్చికం అనేది ఇచ్చిన రిపోజిటరీ ఆకృతీకరణను సంస్థాపిత వ్యవస్థపైన /etc/yum.repos.d/ డైరెక్టరీ నందు దాయును. ఈ ఐచ్చికం ఉపయోగించకుంటే, కిక్‌స్టార్ట్ ఫైల్ నందు ఆకృతీకరించిన రిపోజిటరీ సంస్థాపనా కార్యక్రమం నందు మాత్రమే అందుబాటులో ఉంటుంది, సంస్థాపిత వ్యవస్థపైన కాదు.
    • bootloader --disabled: ఈ ఐచ్చికం బూట్ లోడర్‌ను సంస్థాపించబడుట నుండి నిరోధించును.
    • %packages --nocore: కిక్‌స్టార్ట్ ఫైల్ యొక్క కొత్త ఐచ్చికం %packages వ్యవస్థపై @core ప్యాకేజీ సమూహం సంస్థాపించకుండా అపును. కంటైనర్లతో ఉపయోగించుటకు కనీస వ్యవస్థ సంస్థాపనకు ఇది దోహదమగును.
    వివరించిన ఐచ్చికాలు డాకర్ కంటైనర్స్‌తో కలిపినప్పుడు మాత్రమే ఉపయోగపడునని గమనించండి, మరియు మామూలు సంస్థాపన నందు ఈ ఐచ్చికాలు ఉపయోగిస్తే వ్యవస్థ నిరుపయోగం కావచ్చు.

అనకొండ ఎంట్రోపి

  • Red Hat Enterprise Linux 7.1 నందు, Anaconda ఎంట్రోపిను సేకరించును ఒకవేళ రక్షణ సమస్యలను నిరోధించుటకు డిస్కు ఎన్క్రిప్ట్ చేయవలసివుంటే, తక్కువ తరగతిలో ఎంట్రోపీతో డేటా కొరకు ఎన్క్రిప్ట్ ఫార్మాట్ సృష్టించడం ద్వారా జరుగవచ్చు. కనుక, కావలసిన ఎంట్రోపీ పోగయ్యే వరకు Anaconda వేచివుంటుంది.

గ్రాఫికల్ సంస్థాపిక నందు అంతర్నిర్మిత సహాయం

సంస్థాపిక గ్రాఫికల్ ఇంటర్ఫేస్ మరియు Initial Setup సౌలభ్యం నందలి ప్రతి తెర ఇప్పుడు సహాయం బటన్‌ను పై కుడిమూలన కలిగివుంటుంది. ఈ బటన్‌పై నొక్కితే సంస్థాపనా మార్గదర్శని సంబందితాన్ని ప్రస్తుత తెరకు Yelp సహాయ విహారిణి నుండి జతచేయును.

2.2. బూట్ లోడర్

IBM Power Systems కొరకు సంస్థాపనా మాధ్యమం ఇప్పుడు GRUB2 బూట్ లోడర్‌ను గతంలో ఉన్న yaboot బదులుగా ఉపయోగించును. Red Hat Enterprise Linux for POWER యొక్క బిగ్ ఎండియన్ రకం కొరకు, GRUB2 అభీష్టమైనది అయితే yaboot కూడా ఉపయోగించవచ్చు. కొత్త ‌వచ్చిన little endian రకంకు బూట్ అగుటకు GRUB2 కావాలి.
IBM Power Systems కొరకు GRUB2 ఉపయోగించి నెట్వర్క్ బూట్ సేవిక అమర్చుటకు కావలసిన సూచనలతో సంస్థాపనా మార్గదర్శని నవీకరించబడెను.

అధ్యాయము 3. నిల్వ

LVM క్యాషి

Red Hat Enterprise Linux 7.1, LVM క్యాషీకు పూర్తి తోడ్పాటునిచ్చును. ఈ విశిష్టతతో వాడుకరులు నిదానమైన పెద్ద పరికరాలకు క్యాషీగా వ్యవహరించే చిన్న వేగమైన పరికరంతో లాజికల్ వాల్యూమ్ సృష్టించవచ్చు. క్యాషీ లాజికల్ వాల్యూమ్స్ సృష్టించుటపై మరింత సమాచారం కొరకు lvm(8) మాన్యువల్ పేజీ చూడండి.
క్యాషీ లాజికల్ వాల్యూమ్స్ వినియోగంపై కింది నిభందనలు గమనించండి (LV):
  • క్యాషీ LV తప్పక పై-స్థాయి పరికరం కావాలి. అది థిన్-పూల్‌ LVగా RAID LV ఇమేజ్‌గా, లేదా ఇతర sub-LV రకంగా ఉపయోగించబడలేదు.
  • సృష్టించిన తరువాత క్యాషీ LV యొక్క లక్షణాలు మార్చలేము. క్యాషీ లక్షణాలు మార్చుటకు, క్యాషీ తొలగించి దాన్ని కావలిసిన లక్షణాలతో తిరిగిసృష్టించాలి.

libStorageMgmt API తో స్టోరేజ్ ఎరే నిర్వహణ

Red Hat Enterprise Linux 7.1 నందు, libStorageMgmtతో స్టోరేజ్ ఎరే మానేజ్‌మెంట్, ఒక స్టోరెజ్ ఎరే ఇండిపెండెంట్ API, పూర్తిగా తోడ్పాటునిచ్చును. అందించబడిన API స్థిరమైనది, నిలకడైనది, మరియు విభిన్న స్టోరేజ్ ఎరేలను ప్రోగ్రామేటిక్‌గా నిర్వహించుటకు మరియు హార్డ్‌వేర్-ఏగ్జలరేటెడ్ విశేషణాలను ఉపయోగించుటకు అభివృద్దికారులను అనుమతించును. నిల్వను మానవీయంగా ఆకృతీకరించుటకు వ్యవస్థ నిర్వాహకులను libStorageMgmt ఉపయోగించుటకు అనుమతించును అదేవిధంగా కమాండ్ లైన్ ఇంటర్ఫేస్‌తో నిల్వ నిర్వహణ పనులను స్వయంచాలనం చేయుటకు అనుమతించును. Targetd చొప్పింత పూర్తిగా తోడ్పాటునీయదని మరియు సాంకేతిక మునుజూపువలె ఉందని గమనించండి.
  • NetApp Filer (ontap 7-Mode)
  • Nexenta (nstor 3.1.x only)
  • SMI-S, కింది అమ్మకందార్లకు:
    • HP 3PAR
      • OS విడుదల 3.2.1 లేదాతరువాత
    • EMC VMAX మరియు VNX
      • సొల్యూషన్స్ ఏనేబ్లర్ V7.6.2.48 లేదా తరువాతది
      • SMI-S ప్రొవైడర్ V4.6.2.18 హాట్‌ఫిక్స్ కిట్ లేదా తరువాతది
    • HDS VSP ఎరే నాన్-ఎంబెడెడ్ ప్రొవైడర్
      • హిటాచి కమాండ్ సూట్ v8.0 లేదా తరువాతది
libStorageMgmt పై మరింత సమాచారం కొరకు, relevant chapter in the Storage Administration Guide చూడండి

LSI Syncro కు తోడ్పాటు

Red Hat Enterprise Linux 7.1 megaraid_sas డ్రైవర్ నందు కోడ్ చేర్చి LSI Syncro CS హై-ఎవైలబిలటీ డైరెక్ట్-ఎటాచ్డ్ స్టోరేజ్ (HA-DAS) ఎడాప్టర్స్ చేతనంచేయును. megaraid_sas గతంలో చేతనమైన ఎడాప్టర్లకు పూర్తిగా తోడ్పాటునిచ్చును, Syncro CS కొరకు ఈ డ్రైవర్ యొక్క వినియోగం సాంకేతిక ముందస్తు దర్శనం వలె అందుబాటులోవుంది. ఈ ఎడాప్టర్ కు తోడ్పాటు నేరుగా LSI, మీ సిస్టమ్ ఇంటిగ్రేటర్, లేదా సిస్టమ్ వెండార్ చే అందించబడును. Red Hat Enterprise Linux 7.1 పైన Syncro CS నియోగించే వాడుకరులు వారి స్పందనను Red Hat మరియు LSI కు తెలుపమని సిఫార్సు చేయడమైంది. LSI Syncro CS పరిష్కారాల మరింత సమాచారం కొరకు , దయచేసి http://www.lsi.com/products/shared-das/pages/default.aspx చూడండి.

LVM అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్

Red Hat Enterprise Linux 7.1 కొత్త LVM అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ (API) ను సాంకేతిక ముందస్తు దర్శనం వలె అందిస్తోంది. ఈ API ఫలానా LVM విషయాలను క్వరీ చేయుటకు మరియు నియంత్రించుటకు ఉపయోగించబడును.
మరింత సమాచారం కొరకు lvm2app.h హెడర్ ఫైల్ చూడండి.

DIF/DIX తోడ్పాటు

SCSI ప్రమాణికం నందు DIF/DIX కొత్త చేర్పు మరియు Red Hat Enterprise Linux 7.1 నందు సాంకేతిక ముందస్తు దర్శనం. DIF/DIX అనునది సాధారణంగా ఉపయోగించే 512-byte డిస్కు బ్లాక్‌ పరిమాణంను 512 నుండి 520 బైట్లకు పెంచినది, డాటా ఇంటిగ్రిటీ ఫీల్డ్ (DIF) జతచేస్తూ. DIF అనునది డాటా బ్లాక్ చెక్‌సమ్ విలువను నిల్వవుంచును అది హోస్టు బస్ ఎడాప్టర్ (HBA) చేత వ్రాయడం అవసరమైనప్పుడు లెక్కించబడును. అప్పుడు నిల్వ పరికరం చెక్‌సమ్ స్వీకరించెనని ఖాయపరచును, డాటా మరియు చెక్‌సమ్ రెంటినీ నిల్వవుంచును. చదవండం అవసరమైనప్పుడు, చెక్‌సమ్ అనేది నిల్వపరికరం చేత పరీక్షించవచ్చు, మరియు స్వీకరించు HBA చేత.
మరింత సమాచారం కొరకు, DIF/DIX చేతనమైన బ్లాక్ పరికరాలు అను విభాగాన్ని నిల్వ నిర్వహణా మార్గదర్శని నందు చూడండి.

విస్తరిత device-mapper-multipath సిన్టాక్స్ ఎర్రర్ చెకింగ్ మరియు అవుట్పుట్

device-mapper-multipath సాధనం విస్తరించబడింది multipath.conf ఫైల్‌ను మరింత విశ్వసనీయంగా నిర్ధానించుటకు. ఫలితంగా, multipath.conf పార్స్ చేయలేని వరుసలను కలిగివుంటే, device-mapper-multipath దోషాన్ని నివేదించును మరియు ఆ వరుసలను విస్మరించి సరికాని పార్సింగ్ తప్పించును.
అదనంగా, కింది వైల్డ్‌కార్డ్ ఎక్స్‌ప్రెషన్లు జతచేయబడెను multipathd show paths format కమాండ్ కొరకు:
  • హోస్ట్ మరియు టార్గెట్ ఫైబర్ ఛానల్ వరల్డ్ వైడ్ నోడ్ పేర్ల కొరకు వరుసగా %N మరియు %n
  • హోస్ట్ మరియు టార్గెట్ ఫైబర్ ఛానల్ వరల్డ్ వైడ్ నోడ్ పేర్ల కొరకు వరుసగా %R మరియు %r
ఇప్పుడు, ఫైబర్ ఛానల్ హోస్టులు, టార్గెట్లు, మరియు వాటి పోర్టులతో మల్టీపాత్‌లు కలుపుట సులువు, అది వాడుకరులను వారి నిల్వ ఆకృతీకరణను మరింత సమర్ధవంతంగా ఆకృతీకరించుకొనుటకు అనుమతించును.

అధ్యాయము 4. ఫైల్ సిస్టమ్స్

Btrfs ఫైల్ సిస్టమ్ కొరకు తోడ్పాటు

Btrfs (B-Tree) ఫైల్ సిస్టమ్ సాంకేతిక పరిదృశ్యంవలె Red Hat Enterprise Linux 7.1 నందు తోడ్పాటునీయబడును. ఈ ఫైల్ సిస్టమ్ అధునాతన నిర్వహణను, రిలైబిలిటీను, మరియు స్కేలబిలిటీ విశేషణాలను అందించును. ఇది వాడుకరులను స్నాప్‌షాట్లు సృష్టించుటకు చేతనించును, ఇది కంప్రెషన్ మరియు సమైఖ్య పరికర నిర్వహణను చేతనించును.

సమాంతర NFS తోడ్పాటు

సమాంతర NFS (pNFS) అనునది NFS v4.1 ప్రమాణం నందు భాగము అది క్లైంట్లను నిల్వ పరికరాలను నేరుగా మరియు సమాంతరంగా యాక్సెస్ చేయుటకు అనుమతించును. చాలా వుమ్మడి పనిభారముల కొరకు pNFS ఆకృతి అనునది స్కేలబిలిటీను మరియు NFS సేవికల పనితనంను మెరుగుపరచగలదు. Red Hat Enterprise Linux 6.4 నందు, pNFS పూర్తిగా తోడ్పాటునీయబడును
pNFS అనునది మూడు విభిన్న నిల్వ ప్రొటోకాల్స్ లేదా నమూనాలను నిర్వచించును; ఫైళ్ళు, ఆబ్జక్టులు మరియు బ్లాక్స్. Red Hat Enterprise Linux 7.1 క్లైంట్ ఫైళ్ళ నమూనాను పూర్తిగా, మరియు బ్లాక్ మరియు ఆబ్జక్టు నమూనాలను సాంకేతిక మునుజూపు వలె తోడ్పాటునిచ్చును.
భవిష్యత్తులో కొత్త pNFS నమూనా రకాలను ఉత్తీర్ణించుటకు మరియు మరిన్ని నమూనా రకాలకు పూర్తి తోడ్పాటును అందించుటకు Red Hat పార్ట్నర్లతో మరియు ఓపెన్ సోర్స్ ప్రోజెక్టులతో పనిచేయును.
pNFS పైన మరింత సమాచారం కొరకు, http://www.pnfs.com/ చూడండి.

అధ్యాయము 5. కెర్నల్

Ceph బ్లాక్ పరికరాలకు తోడ్పాటు

libceph.ko మరియు rbd.ko మాడ్యూళ్ళు Red Hat Enterprise Linux 7.1 కెర్నల్‌కు జతచేయబడెను. ఈ RBD కెర్నల్ మాడ్యూళ్ళు లైనక్స్ హోస్ట్‌ను Ceph బ్లాక్ పరికరాన్ని ఒక సాధారణ డిస్క్ డివైజ్ ఎంట్రీ వలె పరిగణించుటకు అనుమతించును, దాన్ని ఒక డైరెక్టరీకు మౌంట్ చేసి ప్రామాణిక ఫైల్ సిస్టమ్, XFS లేదా ext4 వలె ఫార్మాట్ చేయవచ్చు.
CephFS మాడ్యూల్, ceph.ko, ప్రస్తుతం Red Hat Enterprise Linux 7.1 నందు తోడ్పాటు కలిగిలేదని గమనించండి.

సమకాలిక ఫ్లాష్ MCL నవీకరణలు

మైక్రో లెవల్ అప్‌గ్రేడ్స్ (MCL) Red Hat Enterprise Linux 7.1 నందు IBM System z ఆకృతిపై చేతనించబడెను. ఈ నవీకరణనలను I/O కార్యకలాపాలపై ఏ ప్రభావం లేకుండానే ఫ్లాష్ నిల్వ మాధ్యమానికి అమలుచేయవచ్చు మరియు మార్చిన ఫ్లాష్ హార్డ్‌వేర్ సేవా స్థాయిని వాడుకరులకు తెలుపవచ్చు.

గతిక కెర్నల్ ప్యాచింగ్

Red Hat Enterprise Linux 7.1 kpatch ను సాంకేతిక మునుజూపుగా పరిచయంచేస్తోంది, ఒక గతిక "కెర్నల్ పాచింగ్ యుటిలిటి". kpatch ఉపలభ్యం వాడుకరులను బైనరీ కెర్నల్ ప్యాచెస్ సమూహాన్ని నిర్వచించుటకు అనుమతించును అవి కెర్నల్‌ను పునఃప్రారంభించకుండానే గతికంగా ప్యాచ్ చేయుటకు ఉపయోగపడును. kpatch అనేది AMD64 మరియు Intel 64 ఆకృతులపై నడుచుటకు మాత్రమే తోడ్పాటునిచ్చునని గమనించండి.

1 CPU కన్నా ఎక్కువతో క్రాష్‌కెర్నల్

ఒక CPU కన్నా ఎక్కువతో క్రాష్‌కెర్నల్ బూటింగ్ Red Hat Enterprise Linux  7.1 చేతనం చేయును. ఈ ఫంక్షన్ అనేది సాంకేతిక ముందస్తుదర్శనం వలె తోడ్పాటునిచ్చును.

dm-era లక్ష్యం

Red Hat Enterprise Linux  7.1 dm-era డివైజ్-మాపర్ లక్ష్యాన్ని సాంకేతిక ముందస్తుదర్శనంలా పరిచయం చేస్తోంది. వాడుకరి-నిర్వచిత సమయ పరిధి "era" నందు ఏ బ్లాక్స్ వ్రాయబడెనో dm-era ట్రాక్ ఉంచును. ప్రతి ఎరా టార్గెట్ ఇన్‌స్టాన్స్ అనేది ప్రస్తుత ఎరాను మోనోటికల్‌గా పెంచిన 32-bit కౌంటర్ వలె నిర్వహించును. చివరి బ్యాకప్ నుండి ఏ బ్లాక్స్ మారెనో తెలుసుకొనుటకు లక్ష్యం అనేది బ్యాకప్ సాఫ్టువేర్‌ను చేతనించును. వెండార్ స్నాప్‌షాట్‌కు వెళ్ళిన తరువాత క్యాషీ కొహెరెన్స్ తిరిగివుంచుటకు క్యాషీ కాంటెట్ల పాక్షిక ఇన్‌వాలిడేషన్‌ను ఇది చేతనించును. dm-era లక్ష్యం ప్రాథమికంగా dm-cache లక్ష్యంతో జతకట్ట వలసివుంది.

Cisco VIC కెర్నల్ డ్రైవర్

Cisco VIC ఇన్ఫిబాండ్ కెర్నల్ డ్రైవర్ Red Hat Enterprise Linux 7.1 కు సాంకేతిక మునుజూపు వలె జతచేయబడెను. ఈ డ్రైవర్ రిమోట్ డైరెక్టరీ మెమొరీ ఏక్సెస్ (RDMA) వినియోగాన్ని అనుమతించును - ప్రొప్రైటరీ సిస్కో ఆకృతులపైని సిమాన్టిక్స్ వలె.

hwrng నందు విస్తారిత ఎంట్రోపి నిర్వహణ

లైనక్స్ గెస్టుల కొరకు పారావర్చ్యులైజ్డ్ హార్డ్‌వేర్ RNG (hwrng) తోడ్పాటు virtio-rng ద్వారా Red Hat Enterprise Linux 7.1 నందు విస్తరింపబడెను. గతంలో, rngd డీమన్ గెస్ట్ లోపల ప్రారంభింపబడి గెస్ట్ కెర్నల్ యొక్క ఎంట్రోపీ పూల్‌కు నిర్దేశించబడెది. Red Hat Enterprise Linux 7.1 తో మొదలకుని, మానవీయ అమర్పు తీసివేయబడింది. ఒకవేళ గెస్ట్ ఎంట్రోపీ గనుక తెలిపిన స్థాయి కన్నా కిందకు పడిపోతే కొత్త khwrngd త్రెడ్, ఎంట్రోపీను virtio-rng పరికరం నుండి తెచ్చును. ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా చేయడంవలన అన్ని Red Hat Enterprise Linux గెస్టులు కూడా KVM హోస్ట్‌లచే అందించబడుతున్న పారావర్చ్యులైజ్డ్ హార్డ్‌వేర్ RNG కలిగి మెరుగైన రక్షణ పొందవచ్చు.

షెడ్యూలర్ లోడ్-బాలెన్సింగ్ పనితనం మెరుగుదల

గతంలో, షెడ్యూలర్ లోడ్-బాలెన్సింగ్ కోడ్ అనేది అన్ని ఐడిల్ CPUలకు సమతుల్యంగా ఉండేది. Red Hat Enterprise Linux 7.1 నందు, ఐడిల్ CPU తరుపున ఐడిల్ లోడ్ బాలెన్సింగ్ అనేది CPU లోడ్ బాలెన్సింగ్ చేయవలసివున్నప్పుడే జరుగును. ఈ కొత్త ప్రవర్తన వలన ఐడిల్-కాని CPUల పైన లోడ్ బాలెన్సింగ్ రేట్ తగ్గుతుంది కనుక షెడ్యూలర్ చే జరిగే అక్కరలేని పనితగ్గి, దాని పనితనం మెరుగుపడుతుంది.

షెడ్యూలర్ నందు మెరుగైన న్యూఐడిల్ సమతుల్యత

నడుపవలసిన పనులు ఉన్నప్పుడు newidle బాలెన్స్ కోడ్ నందు పనుల కొరకు వెతకకుండా షెడ్యూలర్ యొక్క ప్రవర్తన మార్చబడింది, అది మంచి పనితనాన్నిస్తుంది.

HugeTLB ప్రతి-నోడ్‌కు 1GB హ్యూజ్ పేజ్ ఎలొకేషన్ తోడ్పాటు అందించును

Red Hat Enterprise Linux 7.1 నందు రన్‌టైమ్‌లో గిగ్నాటిక్ పేజ్ ఎలోకేషన్ తోడ్పాటు చేర్చబడింది, ఇది 1GB hugetlbfs వాడుకరిని ఏ Non-Uniform Memory Access (NUMA) నోడ్‌కు రన్‌టైమ్ నందు ఆ 1GB ను కేటాయించాలో తెలుపుటకు అనుమతించును.

కొత్త MCS-ఆధారిత లాకింగ్ మెకానిజం

Red Hat Enterprise Linux 7.1 కొత్త లాకింగ్ మెకానిజం అందిస్తోంది, MCS లాక్స్. ఈ కొత్త లాకింగ్ మెకానిజం పెద్ద వ్యవస్థలలో spinlock భారాన్ని చెప్పుకోదగ్గరీతిలో తగ్గించును, దానితో spinlocks సాధారణంగా Red Hat Enterprise Linux 7.1 నందు మరింత సమర్ధవంతమైనవి. చ

ప్రోసెస్ స్టాక్ పరిమాణం 8KB నుండి 16KB కు పెరిగినది

Red Hat Enterprise Linux 7.1 తో మొదలుకుని, కెర్నల్ స్టాక్ పరిమాణం 8KB నుండి 16KB కు పెంచబడింది అది స్టాక్ స్పేస్‌ను ఉపయోగించే పెద్ద కార్యక్రమాలకు సహాయపడును.

uprobe మరియు uretprobe విశేషణాలు perf మరియు systemtap నందు చేతనించబడెను

Red Hat Enterprise Linux 7.1 తో, uprobe మరియు uretprobe విశేషణాలు perf ఆదేశం మరియు systemtap స్క్రిప్ట్‌తో సరిగా పనిచేయును.

చివర-నుండి-చివరకు డేటా స్థిరత్వ పరిశీలన

IBM System z పైన Red Hat Enterprise Linux 7.1 నందు చివర-నుండి-చివరకు డేటా స్థిరత్వ పరిశీలన తోడ్పాటు పూర్తిగావుంది. ఇది డేటా సమైఖ్యతను వృద్దిచేయును మరియు డేటా కరప్షన్ అదే విదంగా డేటా లాస్‌ను అరికట్టును.

32-Bit వ్యవస్థలపై DRBG

Red Hat Enterprise Linux 7.1 తో, deterministic random bit generator (DRBG) అనేది 32-bit వ్యవస్థలపై పనిచేయుటకు నవీకరించబడింది.

పెద్ద క్రాష్‌కెర్నల్ పరిమాణాలకు తోడ్పాటు

పెద్ద మెమొరీ (4TB కన్నా ఎక్కువ) వ్యవస్థలపై Kdump కెర్నల్ క్రాష్ డంపింగ్ మెకానిజం తోడ్పాటు Red Hat Enterprise Linux 7.1 నందు పూర్తిగావుంది.

అధ్యాయము 6. వర్చ్యులైజేషన్

KVM నందు vCPUల గరిష్ట సంఖ్య పెంచబడెను

KVM గెస్ట్ నందు తోడ్పాటునిచ్చే గరిష్ట వర్చ్యువల్ CPUs (vCPUs) సంఖ్య 240 కు పెంచబడెను. ఇది వాడుకరి గెస్టునకు అప్పగించగల వర్చ్యువల్ ప్రోసెసింగ్ యూనిట్ల సంఖ్యను పెంచును, మరియు వాటి పనితనం మెరుగుపరచును.

QEMU, KVM, మరియు libvirt API నందు 5th జనరేషన్ ఇంటెల్ కోర్ న్యూ ఇన్‌స్ట్రక్షన్స్ తోడ్పాటు

Red Hat Enterprise Linux 7.1 నందు, 5th జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రోసెసర్స్ తోడ్పాటు QEMU హెపర్వజర్‌కు, KVM కెర్నల్‌ కోడ్‌కు, మరియు libvirt API కు జతచేయబడెను. ఇది KVM గెస్టులను కింది సూచనలు మరియు విశేషణాలను ఉపయోగించుటకు అనుమతించును: ADCX, ADOX, RDSFEED, PREFETCHW, మరియు సూపర్‌వైజర్ మోడ్ ఏక్సెస్ ప్రివెన్షన్ (SMAP).

USB 3.0 అనునది KVM అతిథులకు తోడ్పాటునిచ్చును

Red Hat Enterprise Linux 7.1 మెరుగైన USB తోడ్పాటును USB 3.0 హోస్టు ఎడాప్టర్ (xHCI) ఎమ్యులేషన్‌ను సాంకేతిక ముందస్తుదర్శనంలా జతచేస్తూ అందస్తోంది.

dump-guest-memory కమాండ్ కొరకు కంప్రెషన్

Red Hat Enterprise Linux 7.1 నందు, dump-guest-memory కమాండ్ క్రాష్ డంప్ కంప్రెషన్‌కు తోడ్పాటునిచ్చును. ఇది virsh dump ఉపయోగించలేని వాడుకరులు గెస్ట్ క్రాష్ డంప్స్ కొరకు తక్కువ హార్డ్ డ్రైవ్ జాగా ఉపయోగించునట్లు చేయును. అదనంగా, తరచుగా కంప్రెస్ చేసిన గెస్ట్ క్రాష్ డంప్‌ను దాయడానికి కంప్రెస్-చేయని దాన్ని దాయడంకన్నా తక్కువ సమయం పడుతుంది.

ఓపెన్ వర్చ్యువల్ మిషన్ ఫర్మ్‌వేర్

ఓపెన్ వర్చ్యువల్ మిషన్ ఫర్మ్‌వేర్ (OVMF) సాంకేతిక మునుజూపువలె Red Hat Enterprise Linux 7.1 నందు అందుబాటులోవుంది. OVMF అనేది AMD64 మరియు Intel 64 కొరకు UEFI సెక్యూర్ బూట్ ఎన్విరాన్మెంట్.

Hyper-V పై మెరుగైన నెట్వర్క్ పనితనం

Hyper-V నెట్వర్క్ డ్రైవర్ యొక్క చాలా కొత్త విశేషణాలు నెట్వర్క్ పనితనం మెరుగుపడుటకు తోడ్పడును. ఉదాహరణకు, రిసీవ్-సైడ్ స్కేలింగ్, లార్జ్ సెండ్ ఆఫ్‌లోడ్, స్కేటర్/గేదర్ I/O ఇప్పుడు తోడ్పాటునిచ్చును, మరియు నెట్వర్క్ త్రౌపుట్ పెంచబడెను.

hyperv-daemons నందు hypervfcopyd

hypervfcopyd డీమన్ hyperv-daemons ప్యాకేజీలకు జతచేయబడెను. hypervfcopyd అనేది Hyper-V 2012 R2 హోస్ట్ పైన నడిచే లైనక్స్ గెస్ట్ కొరకు ఫైల్ కాపీ సర్వీస్ ఫంక్షనాలిటీ యొక్క ఇంప్లిమెంటేషన్. ఇది హోస్ట్‌ను ఒక ఫైల్ (VMBUS నందు) లైనక్స్ గెస్ట్‌కు నకలు తీయుటకు అనుమతించును.

libguestfs నందు కొత్త విశేషణాలు

libguestfs నందు Red Hat Enterprise Linux 7.1 చాలా కొత్త విశేషణాలను అందిస్తోంది, వర్చ్యువల్ మిషన్ డిస్క్ ఇమేజ్‌లను సవరించుటకు ఒక సాధన సమితిని.
కొత్త సాధనాలు
  • virt-builder — వర్చ్యువల్ మిషన్ ఇమే‌జ్‌లు నిర్మించుటకు కొత్త సాధనం. గెస్ట్‌లను త్వరితంగా సురక్షితంగా సృష్టించి మరియు వాటిని మలచుకొనుటకు virt-builder ఉపయోగించును.
  • virt-customize — వర్చ్యువల్ మిషన్ డిస్క్ ఇమేజ్‌లను మలచుకొనుటకు కొత్త సాధనం. ప్యాకేజీలను సంస్థాపించుటకు, ఆకృతీకరణ ఫైళ్ళను సరిచేయుటకు, స్క్రిప్ట్స్ నడుపుటకు, మరియు సంకేతపదాలు అమర్చుటకు virt-customize ఉపయోగించును.
  • virt-diff — రెండు వర్చ్యువల్ మిషన్ల ఫైల్ సిస్టమ్స్ మధ్యన తేడాలను చూపుటకు కొత్త సాధనం. స్నాప్‌షాట్ల మద్యన ఏ ఫైళ్ళు మార్చబడెనో సులభంగా కనుగొనుటకు virt-diff ఉపయోగించుము.
  • virt-log — గెస్టులనుండి లాగ్ ఫైళ్ళను జాబితా చేయుటకు కొత్త సాధనం. లైనక్స్ ట్రెడిషనల్, జర్నల్ ఉపయోగించు లైనక్స్, మరియు విండోస్ ఈవెంట్ లాగ్ తో కలిపి virt-tool చాలా రకాల గెస్టులకు తోడ్పాటునిచ్చును.
  • virt-v2v — ఫారెన్ హైపర్విజర్లనుండి గెస్టులను KVM, libvirt, OpenStack, oVirt, Red Hat Enterprise Virtualization (RHEV), మరియు అనేక ఇతర లక్ష్యాల పైన నడుపేందుకు మార్చే కొత్త సాధనం. ప్రస్తుతం, virt-v2v అనేది Red Hat Enterprise Linux ను Xen మరియు VMware ESX పైన నడిచే Windows గెస్టులను మార్చగలదు.

virtio-blk-data-plane ఉపయోగించి మెరుగైన బ్లాక్ I/O పనితనం

virtio-blk-data-plane I/O వర్చ్యులైజేషన్ ఫంక్షనాలిటి Red Hat Enterprise Linux 7.1 నందు పూర్తిగా తోడ్పాటునిచ్చును. ఈ ఫంక్షనాలిటీతో QEMU డిస్క్ I/O ను I/O పనితనం కొరకు ఆప్టిమైజ్ చేసి కేటాయించిన త్రెడ్ నందు జరుపుటకు అనుమతించును.

ఫ్లైట్ రికార్డర్ ట్రేసింగ్

SystemTap-ఆధారిత ట్రేసింగ్ Red Hat Enterprise Linux 7.1 నందు పరిచయంచేయబడింది. SystemTap-ఆధారిత ట్రేసింగ్ వాడుకరులను qemu-kvm డేటాను గెస్ట్ మిషన్ నడుస్తున్నంత సేపూ స్వయంచాలకంగా పొందుటకు అనుమతించును. ఇది qemu-kvm సమస్యలను పరిష్కరించుటకు అదనపు వెసులుబాటు కల్పించును, qemu-kvm కోర్ డంప్ల కన్నా అనువైనది.
ఫ్లేట్ రికార్డర్ ట్రేసింగ్ ఎలా ఆకృతీకరించాలి మరియు ఉపయోగించాలి అనేదానిపై మరింత సమాచారం కొరకు Virtualization Deployment and Administration Guide చూడండి.

NUMA నోడ్ మెమొరీ ఎలొకేషన్ కంట్రోల్

<memnode> అనేది <numatune> అమరిక కొరకు libvirt డొమైన్ XML ఆకృతీకరణనందు చేర్చబడింది. ఇది వాడుకరులను గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ప్రతి నాన్-యూనిఫాం మెమొరీ ఏక్సెస్ (NUMA) నోడ్ కొరకు మెమొరీ నిభందనలను నియంత్రించుటకు అనుమతించును, అది qemu-kvm కొరకు పనితనం మెరుగుదలను అందించును.

అధ్యాయము 7. క్లస్టరింగ్

Corosync కొరకు డైనమిక్ టోకెన్ టైమ్అవుట్

token_coefficient ఐచ్చికం Corosync Cluster Engine కు జతచేయబడెను. token_coefficient యొక్క విలువ nodelist విభాగము తెలిపినప్పుడే ఉపయోగించబడును మరియు కనీసం మూడు నోడ్లను కలిగివుంటుంది. అటువంటి సందర్భములో, గడువుతీరిన టోకెన్ ఈ కిందివిధంగా లెక్కించబడును:
[token + (amount of nodes - 2)] * token_coefficient
ప్రతిసారి కొత్త నోడ్ జతచేసినప్పుడు టోకెన్ గడువును మానవీయంగా మార్చకుండా క్లస్టర్ స్కేల్ చేయుటకు ఇది అనుమతించును. అప్రమేయ విలువ 650 మిల్లీసెకన్లు, అయితే అది 0 కు అమర్చవచ్చు, అది ఈ విశేషణాన్ని తీసివేయును.
నోడ్ల గతిక చేర్పు మరియు తీసివేతను Corosync సంభాలించగల్గుటకు ఈ విశేషణం అనుమతించును.

Corosync Tie Breaker విస్తరింపు

టై బ్రేకర్ నోడ్ల ఆకృతీకరణ వెసులుబాటు మరియు సవరింపుల కొరకు ఐచ్చికాలు అందించుటకు Corosync యొక్క క్వోరమ్ విశేషణం auto_tie_breaker విస్తరింపబడెను. సమమైన క్లస్టర్ స్ప్లిట్ నందు క్వోరమ్‌ను నిలిపివుంచుటకు వాడుకరులు ఇప్పుడు నోడ్ల జాబితాను ఎంచవచ్చు, లేదా తక్కువ నోడ్ ఐడి లేదా ఎక్కువ నోడ్ ఐడిను బట్టి నోడ్ ద్వారా క్వోరమ్‌ను నిలిపివుంచునట్లు ఎంచుకోవచ్చు.

Red Hat హై ఎవైలబిలిటీ కొరకు విస్తరింపులు

Red Hat Enterprise Linux 7.1 విడుదల కొరకు, Red Hat High Availability Add-On కింది విశేషణాలకు తోడ్పాటునిచ్చును. ఈ విశేషణాలపై సమాచారం కొరకు, High Availability Add-On Reference మాన్యువల్ చూడండి.
  • pcs resource cleanup ఆదేశం ఇప్పుడు రిసోర్స్ స్థితి మరియు failcount ను అన్ని వనరుల కొరకు తిప్పివుంచగలదు.
  • pcs resource move ఆదేశం సృష్టించే రిసోర్స్ ఎంత సేపు ప్రభావంగా ఉండాలో సూచించే కాలాన్ని ఈ ఆదేశం కొరకు lifetime పారామితిగా మీరు తెలుపవచ్చు.
  • ఏక్సెస్ కంట్రోల్ లిస్ట్స్ (ACLs) ఉపయోగించి క్లస్టర్ ఆకృతీకరణకు రీడ్-ఓన్లీ లేదా రీడ్-వ్రైట్ ఏక్సెస్ అనుమతించుటకు స్థానిక వాడుకరుల కొరకు అనుమతులు అమర్చుటకు మీరు pcs acl ఆదేశం ఉపయోగించవచ్చు.
  • సాధారణ రిసోర్స్ ఐచ్చికాలకు అధనంగా ఇప్పుడు pcs constraint ఆదేశం ఫలానా కన్‌స్ట్రైన ఐచ్చికాల ఆకృతీరణకు తోడ్పాటునిచ్చును.
  • సృష్టించబడుచున్న రిసోర్స్ స్వయంచాలకంగా ప్రారంభించబడదని సూచించుటకు pcs resource create ఆదేశం disabled పారామితికి తోడ్పాటునిచ్చును.
  • క్వోరమ్‌ను ఏర్పరుచునప్పుడు కస్టర్ అన్ని నోడ్ల కొరకు వేచివుండకుండా pcs cluster quorum unblock ఆదేశం చేయును.
  • pcs resource create ఆదేశం యొక్క before మరియు after పారామితులతో మీరు రిసోర్స్ గ్రూప్ ఆర్డర్‌ను ఆకృతీకరించవచ్చు.
  • pcs config ఆదేశం యొక్క backup మరియు restore ఐచ్చికాలతో బ్యాకప్ నుండి అన్ని నోడ్లపైని క్లస్టర్ ఆకృతీకరణ ఫైళ్ళను మీరు రీస్టోర్ చేయవచ్చు మరియు క్లస్టర్ ఆకృతీకరణను టార్బాల్ నందు బ్యాకప్ తీయవచ్చు.

అధ్యాయము 8. కంపైలర్ మరియు సాధనములు

System z Binaries పైన హాట్-పాచింగ్ తోడ్పాటు లైనక్స్ కొరకు

System z binaries పైని లైనక్స్ కొరకు మల్టీ-త్రెడెడ్ కోడ్ ఆన్-లైన్ పాచింగ్ తోడ్పాటును GNU Compiler Collection (GCC) వృద్దిచేసెను. "function attribute" ఉపయోగించి హాట్-పాచింగ్ కొరకు ఫలానా ఫంక్షన్లను ఎంపికచేయుట చేతనించబడెను మరియు అన్ని ఫంక్షన్ల కొరకు హాట్-పాచింగ్ అనేది -mhotpatch కమాండ్-లైన్ ఐచ్చికం ఉపయోగించి చేతనించవచ్చు.
హాట్-పాచింగ్‌ను చేతనించడం అనేది సాఫ్ట్‌వేర్ పరిమాణం మరియు పనితనంపై చెడు ప్రభావం కలిగివుంది. కనుకనే అన్ని ఫంక్షన్ల కొరకు హాట్-పాచింగ్‌ను చేతనించుటకన్నా కొన్ని ఫంక్షన్ల కొరకు హాట్-పాచింగ్‌ను ఉపయోగించడం సిఫార్సు చేయడమైంది.
లైనక్స్ కొరకు హాట్-పాచింగ్ తోడ్పాటు అనేది System z బైనరీలపైన Red Hat Enterprise Linux 7.0 కొరకు సాంకేతిక పరిదృశ్యం వంటిది. Red Hat Enterprise Linux 7.1 విడుదలతో, ఇది ఇప్పుడు పూర్తిగా తోడ్పాటునిచ్చును.

పర్ఫార్మెన్స్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఎన్హాన్స్‌మెంట్

Red Hat Enterprise Linux 7 అనేది Performance Application Programming Interface (PAPI) కలిగివుంది. PAPI అనేది నవీన మైక్రోప్రోసెసర్లపైన హార్డ్‌వేర్ ఫర్ఫార్మెన్స్ కౌంటర్స్‌కు క్రాస్-ప్లాట్‌ఫాం ఇంటర్ఫేసుల కొరకు ఒక స్పెసిఫికేషన్. ఈ కౌంటర్లు రిజిస్టర్ల సమితిగా ఉంటాయి అవి ఘటనలను లెక్కించును, ఆ ఘటనలు అనేవి ప్రోసెసర్ ఫంక్షన్‌కు చెందిన సంకేతాలు. అనువర్తనం పనితనం విశ్లేషించుటలో ఈ ఘటనలను పర్యవేక్షించడం వలన వివిధ ఉపయోగాలున్నాయి.
IBM Power 8, Applied Micro X-Gene, ARM Cortex A57, మరియు ARM Cortex A53 ప్రోసెసర్లకు తోడ్పాటును అందించుటకు Red Hat Enterprise Linux 7.1 నందు PAPI మరియు సంబందిత libpfm లైబ్రరీలు విస్తరింపబడెను. అదనంగా, ఘటనల సమితి అనునది Intel Haswell, Ivy Bridge, మరియు Sandy Bridge ప్రోసెసర్ల కొరకు నవీకరించబడెను.

OProfile

OProfile అనేది లైనక్స్ సిస్టమ్స్ కొరకు సిస్టమ్-వైడ్ ప్రొఫైలర్. ప్రొఫైలింగ్ అనేది బ్యాక్‌గ్రౌండ్ నందు పారదర్శకంగా నడుచును మరియు ప్రొఫైల్ డేటా ఎప్పుడైనా సేకరించవచ్చు. Red Hat Enterprise Linux 7.1 నందు, OProfile అనేది కింది ప్రోసెసర్ ఫ్యామిలీల కొరకు తోడ్పాటును అందించుటకు విస్తరించబడెను: Intel Atom Processor C2XXX, 5th Generation Intel Core Processors, IBM Power8, AppliedMicro X-Gene, and ARM Cortex A57.

OpenJDK8

సాంకేతిక పరిదృశ్యంవలె, Red Hat Enterprise Linux 7.1 java-1.8.0-openjdk ప్యాకేజీలను అందించును, అది Open Java Development Kit (OpenJDK), OpenJDK8 సరికొత్త వర్షన్ కలిగివుంటుంది. ఈ ప్యాకేజీలు పూర్తిగా Java SE 8 యొక్క ఇంప్లిమెంటేషన్‌కు సారూప్యమైనవి మరియు java-1.7.0-openjdk ప్యాకేజీలకు సమాంతరంగా ఉపయోగించవచ్చు, అవి Red Hat Enterprise Linux 7.1 నందు అందుబాటులో ఉంటాయి.
Java 8 మరిన్ని కొత్త మెరుగుదలలను అందించును, లాంబ్డా ఎక్సుప్రెషన్లు, అప్రమేయ విధానాలు, కొత్త స్ట్రీమ్ API కలెక్షన్ల కొరకు, JDBC 4.2, హార్డ్‌వేర్ AES తోడ్పాటు, మరియు ఇంకా. వీటికి అదనంగా, OpenJDK8 పెక్కు ఇతర పర్ఫార్మెన్స్ నవీకరణలు మరియు బగ్ పరిష్కారాలు కలిగివుంటుంది.

sosreport అనేది snap పునఃస్థాపించును

నిలిపివేసిన snap సాధనం powerpc-utils ప్యాకేజీనుండి తీసివేయబడింది. దీని ఫంక్షనాలిటీ sosreport సాధనంకు సమైఖ్యపరచబడెను.

Little-Endian 64-bit PowerPC కొరకు GDB తోడ్పాటు

Red Hat Enterprise Linux 7.1 అనేది GNU డీబగ్గర్ (GDB) నందలి 64-bit PowerPC little-endian architecture కొరకు తోడ్పాటును వృద్దిచేయును.

Tuna విస్తరింపు

షెడ్యూలర్ ట్యూనబుల్స్ సర్దుబాటుకు ఉపయోగించగల టూల్ Tuna, షెడ్యూలర్ పాలసీ ‌వంటిది, RT ప్రాముఖ్యత, మరియు CPU ఎఫినిటి. Red Hat Enterprise Linux 7.1 తో, ఆరంభమైనప్పుడు రూట్ ఆథరైజేషన్ అభ్యర్ధించుటకు Tuna GUI విస్తరించబడెను, కనుక Tuna GUI ప్రేరేపించుటకు వాడుకరి డెస్క్‌టాప్‌ను root వలె నడుపవలసిన అవసరంలేదు. Tuna పై మరింత సమాచారం కొరకు, Tuna వాడుకరి మార్గదర్శని చూడండి.

అధ్యాయము 9. నెట్వర్కింగ్

నమ్మికైన నెట్వర్కు అనుసంధానం

Red Hat Enterprise Linux  7.1 అనేది నమ్మికైన నెట్వర్కు అనుసంధానం అను ఫంక్షనాలిటీను సాంకేతిక మునుజూపు వలె తెచ్చింది. నమ్మికైన నెట్వర్కు అనుసంధానం అనునది ఇప్పటికే ఉన్న నెట్వర్కు ఏక్సెస్ కంట్రోల్ (NAC) పరిష్కారాలతో ఉపయోగించబడును, అవి TLS, 802.1X, లేదా ఎండ్ పాయింట్ పోస్టర్ ఎసెస్‌మెంట్ కలుపుటకు IPsec; అది, ఎండ్ పాయింట్ సిస్టమ్ సమాచారం సేకరించును (ఆపరేటింగ్ సిస్టమ్ ఆకృతీకరణ అమరికలు, సంస్థాపిత ప్యాకేజీలు, మరియు ఇతరములు, ఇంటిగ్రిటీ మెజర్‌మెంట్సుగా పిలువబడేవి, మొదలైనవి). ఎండ్ పాయింట్‌ను నెట్వర్కును ఏక్సెస్ చేయుటకు అనుమతించుటకు ముందుగా నమ్మికైన నెట్వర్కు అనుసంధానం ఈ మెజర్‌మెంట్లను నెట్వర్కు ఏకెస్స్ పాలసీలతో నిర్ధారించుకొనును.

qlcnic డ్రైవర్ నందు SR-IOV ఫంక్షనాలిటీ

సింగిల్ రూట్ I/O వర్చ్యులైజేషన్ (SR-IOV) తోడ్పాటు qlcnic డ్రైవర్ కొరకు సాంకేతిక మునుజూపు వలె జతచేయబడెను. ఈ ఫంక్షనాలిటీ కొరకు తోడ్పాటు నేరుగా QLogic నుండి అందించబడును, మరియు వినియోగదారులు QLogic మరియు Red Hat కు వారి స్పందనను తెలుపాలని కోరుచున్నాము. qlcnic డ్రైవర్ నందు ఇతర ఫంక్షనాలిటీ పూర్తిగా తోడ్పాటునిచ్చును.

బెర్క్‌లె పాకెట్ ఫిల్టర్

traffic classifier ఆధారిత బెర్క్‌లె పాకెట్ ఫిల్టర్ (BPF) కు తోడ్పాటు Red Hat Enterprise Linux 7.1 నందు చేర్చబడింది. పాకెట్ సాకెట్ల కొరకు పాకెట్ ఫిల్టరింగ్ నందు BPF ఉపయోగించబడింది, secure computing mode (seccomp), మరియు Netfilter నందు సాండ్-బాక్సింగ్ తోడ్పాటు కొరకు. అతి ముఖ్యమైన ఆకృతల కొరకు BPF జస్ట్-ఇన్-టైమ్ అభివృద్ది కలిగివుంది మరియు ఫిల్టర్ల నిర్మాణానికి రిచ్ సిన్టాక్స్ కలిగివుంది.

మెరుగైన క్లాక్ స్థిరత్వం

గతంలో , టిక్‌లెస్ కెర్నల్ సామర్ధ్యాన్ని అచేతనపరిస్తే అది సిస్టమ్ క్లాక్ స్థిరత్వాన్ని చెప్పుకోదగ్గట్లు మెరుగుపరిచిందని పరీక్షా ఫలితాలు సూచించాయి. కెర్నల్ బూట్ ఆప్షన్ పారామితులకు nohz=off ను జతచేసి కెర్నల్ టిక్‌లెస్ రీతిని అచేతనించవచ్చు. ఏమైనా, కెర్నల్‌కు అమలుచేసిన ఇటీవలి మెరుగుదలలు Red Hat Enterprise Linux 7.1 నందు సిస్టమ్ క్లాక్ స్థిరత్వాన్ని బాగా మెరుగుపరచాయి మరియు nohz=off ఉన్నా లేకున్నా క్లాక్ స్థిరత్వంలో తేడా చాలా మంది వాడుకరులకు తక్కువగా వుంది. PTP మరియు NTP ఉపయోగించే టైమ్ సింక్రొనైజేషన్ అనువర్తనాలుకు ఇది ఉపయోగకరం.

libnetfilter_queue ప్యాకేజీలు

libnetfilter_queue ప్యాకేజీ Red Hat Enterprise Linux 7.1 కు జతచేయబడింది. కెర్నల్ పాకెట్ ఫిల్టర్ చేత క్యూ పెట్టబడిన పాకెట్లకు API అందిచే యూజర్ స్పేస్ లైబ్రరీ libnetfilter_queue. ఇది క్యూలోవున్న పాకెట్లను nfnetlink_queue ఉపవ్యవస్థ నుండి స్వీకరించడం, పార్శింగ్ చేయడం, పాకెట్‌ హెడర్లు తిరిగివ్రాయడం, మరియు మార్చిన పాకెట్లను తిరిగి-ఇంజెక్ట్ చేయ‍డం చేతనించును.

టీమింగ్ విస్తరింపులు

libteam ప్యాకేజీ Red Hat Enterprise Linux 7.1 నందు 1.14-1 కు నవీకరించబడెను. ఇది చాలా బగ్ పరిష్కారాలను మరియు మెరుగుదలలను అందించును, ప్రత్యేకించి, teamd ఇప్పుడు స్వయంచాలకంగా systemd చేత రీస్పాన్ చేయబడును, అది మొత్తంమీద విశ్వసనీయతను పెంచును.

Intel QuickAssist టెక్నాలజీ డ్రైవర్

Intel QuickAssist Technology (QAT) డ్రైవర్ Red Hat Enterprise Linux 7.1 కు జతచేయబడెను. QAT డ్రైవర్ QuickAssist హార్డ్‌వేర్ చేతనించును అది హార్డ్‌వేర్ ఆఫ్‌లోడ్ క్రిప్టో సామర్ధ్యాలను వ్యవస్థకు జతచేయును.

PTP మరియు NTP మధ్యన ఫెయిల్‌వోవర్ కు LinuxPTP టైమ్‌మాస్టర్ తోడ్పాటు

linuxptp ప్యాకేజీ Red Hat Enterprise Linux 7.1 నందు 1.4 వర్షన్‌కు నవీకరించబడెను. అది చాలా బగ్ పరిష్కారాలను మరియు మెరుగుదలలను అందించును, ప్రత్యేకించి, PTP డొమైన్లు మరియు NTP సోర్సెస్ మద్యన ఫెయిల్‌వోవర్‌కు తోడ్పాటును timemaster అనువర్తనంతో అందించును. నెట్వర్క్ పైన పలు PTP డొమైన్లు అందుబాటులో ఉన్నప్పుడు, లేదా NTP కు ఫాల్‌బాక్ అవసరమైనప్పుడు, సిస్టమ్‌ క్లాక్‌ను అందుబాటులోని అన్ని టైమ్ సోర్సెస్‌కు సింక్రొనైజ్ చేయుటకు timemaster ప్రోగ్రామ్ ఉపయోగించవచ్చు.

నెట్వర్క్ ఇన్‌స్క్రిప్ట్స్

మలచుకొనిన VLAN పేర్లకు తోడ్పాటు Red Hat Enterprise Linux 7.1 నందు చేర్చబడెను. GRE టన్నెల్స్ నందు IPv6 కొరకు మెరుగైన తోడ్పాటు జతచేయబడెను; పునఃప్రారంభినప్పుడుకూడా ఇన్నర్ అడ్రస్ ఇప్పుడు అలానే ఉంటుంది.

TCP డిలేడ్ ACK

Red Hat Enterprise Linux 7.1 నందు iproute ప్యాకేజీనకు ఆకృతీకరించగల TCP Delayed ACK తోడ్పాటు జతచేయబడెను. ఇది ip route quickack ఆదేశంతో చేతనించవచ్చు.

నెట్వర్కుమెనేజర్

బాండింగ్ ఐచ్చికం lacp_rate ఇప్పుడు Red Hat Enterprise Linux 7.1 నందు తోడ్పాటునిచ్చును. మాస్టర్ ఇంటర్ఫేస్‌లను స్లేవ్‌ఇంటర్ఫేస్‌లతో పునఃనామకరణ చేయునప్పుడు సులువైన పరికర నామకరణం కొరకు NetworkManager ఇప్పుడు మెరుగుపరచబడెను.
అదనంగా, NetworkManager యొక్క ఆటో-కనెక్ట్ ఫంక్షన్‌కు ప్రాముఖ్యతా అమర్పు జతచేయబడెను. ఆటో-కనెక్ట్‌కు అర్హతగల కాండిడేట్ ఒకటికన్నా ఎక్కువవుంటే, NetworkManager అనేది అధిక ప్యాముఖ్యగల అనుసంధానం ఎంపికచేయును. అందుబాటులోని అన్ని అనుసంధానాలు ఒకే ప్రాముఖ్యతను కలిగివుంటే, NetworkManager అప్రమేయ ప్రవర్తనను ఉపయోగించి చివరగా క్రియాశీలంగావున్న అనుసంధానంను ఎంపికచేయును.

నెట్వర్క్ నేమ్‌స్పేసెస్ మరియు VTI

నెట్వర్క్ నేమ్‌స్పేసెస్‌తో virtual tunnel interfaces (VTI) కు తోడ్పాటు Red Hat Enterprise Linux 7.1 నందు జతచేయబడింది. పాకెట్స్ ఎన్‌కాప్సులేటెడ్ అయినప్పుడు లేదా డీ-ఎన్‌కాప్సులేటెడ్ అయినప్పుడు వివిధ నేమ్‌స్పేస్‌ల మధ్యన VTI ట్రాఫిక్‌ పాస్‌ను ఇది చేతనించును.

MemberOf Plug-In కొరకు ప్రత్యామ్నాయ ఆకృతీకరణ నిల్వ

389 డైరెక్టరీ సర్వర్ కొరకు MemberOf చొప్పింత ఆకృతీకరణ ఇప్పుడు బ్యాకెండ్ డాటాబేస్‌కు మాపైన సఫిక్స్ నందు నిల్వవుంచవచ్చు. ఇది MemberOf చొప్పింత ఆకృతీకరణ ప్రతిబింబించుటకు అనుమతించును, అది ఆ ప్రతిబింబించిన ఎన్విరాన్మెంట్ నందు స్థిరమైన MemberOf చొప్పింత ఆకృతీకరణ నిర్వహించుటకు వాడుకరికి సులభతరం చేయును.

అధ్యాయము 10. డాకర్ ఫార్మాట్‌తో లైనక్స్ కంటైనర్స్

Docker ఓపెన్ సోర్స్ ప్రోజెక్ట్ అది లైనక్స్ కంటైనర్స్ లోపల అనువర్తనాల నియోగాన్ని స్వయంచాలనం చేయును, మరియు ఒక అనువర్తనాన్ని దాని రన్‌టైమ్ డిపెండెన్సీలతో ఒక కంటైనర్ లోనికి ప్యాకేజ్ చేయడానికి సహకరిస్తుంది. ఇది Docker CLI కమాండ్ లైన్ టూల్‌ను ఇమేజ్-ఆధారిత కంటైనర్స్ యొక్క లైఫ్‌సైకిల్ నిర్వహణకు అందించును. లైనక్స్ కంటైనర్స్ త్వరిత అనువర్తన నియోగాన్ని, సరళమైన పరీక్షణను, నిర్వహణను, మరియు సమస్యాపరిష్కారాన్ని అందిస్తూ రక్షణను మెరుగుపరచును. Red Hat Enterprise Linux 7 ను Docker తో ఉపయోగిస్తే వినియోగదారులకు స్టాఫ్ ఎఫీషియన్సీ, వేగవంతమైన థర్డ్-పార్టీ అనువర్తనాల నియోగం, మరింత చురుకైన అభివృద్ది వాతావరణం, మరియు వనరులను సమర్ధవంతంగా నిర్వహించగల సామర్ధ్యం లభిస్తాయి.
Docker కంటైనర్స్ త్వరితంగా అప్ అయ్యి నడుచుటకు, Get Started with Docker Containers చూడండి.
Red Hat Enterprise Linux 7.1 నందు Docker 1.3.2 అందిచబడును, దానిలో చాలా కొత్త విశేషణాలు ఉన్నాయి.
  • డిజిటల్ సిగ్నేచర్ వెరిఫికేషన్ అనునది డాకర్ నందు సాంకేతిక మునుజూపు విశేషణంగా అందిచబడెను. డాకర్ ఇంజన్ ఇప్పుడు డిజిటల్ సిగ్నేచర్లు ఉపయోగించి అన్ని అధికారిక రెపోల యొక్క సమైఖ్యతను మరియు మూలంను స్వయంచాలకంగా నిర్ధారించును.
  • docker exec ఆదేశం అనునది Docker API ఉపయోగించి డాకర్ కంటైనర్ లోపల ప్రోసెస్‌లు స్పాన్ అగునట్లు చేయును.
  • docker create ఆదేశం కంటైనర్ సృష్టించును కానీ దానినందు ప్రోసెస్‌ను స్పాన్ చేయదు. ఇది కంటైనర్ల లైఫ్ సైకిల్ నిర్వహణను మెరుగుపరచును.
Red Hat Enterprise Linux 6 మరియు Red Hat Enterprise Linux 7 రెంటిపైన అనువర్తనాలను నిర్మించుటకు డాకర్ ఆధారిత ఇమేజ్‌లను Red Hat అందించును.
ఆర్కె‌స్ట్రైటింగ్ కంటైనర్ల నందు ఉపయోగించుటకు Red Hat Kubernetes కూడా అందించును. Kubernetes గురించి మరింత సమాచారం కొరకు Get Started Orchestrating Docker Containers with Kubernetes చూడండి.
డాకర్ ఫార్మాట్‌తో గల లైనక్స్ కంటైనర్స్ SELinux చేతనంగా గల హోస్టులపై కూడా నడువగలవు. /var/lib/docker/ సంచయం B-tree ఫైల్ సిస్టమ్ (Btrfs) ఉపయోగించే వాల్యూమ్ పైన ఉంటే SELinux తోడ్పాటు ఉండదు.

10.1. డాకర్ కంటైనర్స్ మూలకాలు

Docker కింది ప్రాథమిక మూలకాలతో పనిచేయును:
  • కంటైనర్ – అనువర్తనం సాండ్‌బాక్స్. ప్రతి కంటైనర్ కూడా image పైన ఆధారపడును అది కావలసిన ఆకృతీకరణ డేటాను కలిగివుంటుంది. మీరు ఇమేజ్ నుండి కంటైనర్‌ను ఆరంభించగానే, ఆ ఇమేజ్ పైన వ్రాయగల పొర ఏర్పడుతుంది. మీరు (docker commit ఆదేశం ఉపయోగించి) కంటైనర్‌ను కమిట్ చేసిన ప్రతిసారి, ఒక కొత్త ఇమేజ్ పొర జతచేయబడి దానినందు మీ మార్పులు నిల్వవుంచబడును.
  • ఇమేజ్ – కంటైనర్స్ ఆకృతీకరణ యొక్క ఒక స్టాటిక్ స్నాప్‌షాట్. ఇమేజ్ అనునది చదవగల పొర మాత్రమే అది ఎప్పుడు సవరించబడదు, పైన ఉన్న వ్రాయగల పొరనందే అన్ని మార్పులు చేయబడును, మరియు కొత్త ఇమేజ్ సృష్టించడంచేత మాత్రమే దాయబడును. ప్రతి ఇమేజ్ కూడా ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పేరెంట్ ఇమేజ్‌లపై అధారపడును.
  • ప్లాట్‌ఫాం ఇమేజ్ – పేరెంట్ లేని ఒక ఇమేజ్. ప్లాట్‌ఫాం ఇమేజ్‌లు అనునవి కంటైనరైజ్డ్ అనువర్తనాలు నడుచుటకు కావలసిన రన్‌టైమ్ ఎన్విరాన్మెంట్, ప్యాకేజీలు, మరియు ఉపలభ్యాలను నిర్వచించును. ప్లాట్‌ఫాం ఇమేజ్‌లను కేవలం చదవగలం, కనుక నకలుచేసిన ఇమేజ్‌లనందు ప్రతిబింబించే మార్పులు ఏవైనా దాని పైన పేర్చబడును. ఆవిధంగా పేర్చబడటాన్ని మూర్తి 10.1, “డాకర్ ఫార్మాట్ ఉపయోగించి ఇమేజ్ లేయరింగ్” నందు చూడండి.
  • రిజిస్ట్రీ – ఇమేజెస్ యొక్క రిపోజిటరీ. రిజిస్ట్రీలు అనేవి పబ్లిక్ లేదా ప్రైవేట్ రిపోజిటరీలు అవి దింపుకోలుకు ఇమేజ్‌లను అందుబాటులో ఉంచుతాయి. కొన్ని రిజిస్ట్రీలు వాడుకరులను ఇమేజ్‌లను ఎగుమతి చేయుటకు అనుమతించి వాటిని ఇతరులకు అందుబాటులో ఉంచును.
  • డాకర్‌ఫైల్ – డాకర్ ఇమేజ్‌ల కొరకు బిల్డ్ సూచనలను కలిగివున్న ఒక ఆకృతీకరణ ఫైల్. బిల్డ్ విధానాలను స్వయంచాలనం చేయుటకు, తిరిగివుపయోగించుటకు, మరియు పంచుకొనుటకు డాకర్‌ఫైల్స్ ఒక మార్గాన్ని అందించును.
డాకర్ ఫార్మాట్ ఉపయోగించి ఇమేజ్ లేయరింగ్
A scheme depicting image layers used in Docker.

మూర్తి 10.1. డాకర్ ఫార్మాట్ ఉపయోగించి ఇమేజ్ లేయరింగ్


10.2. డాకర్ ఉపయోగంవలన లాభాలు

Docker అనునది కంటైనర్ నిర్వహణ కొరకు API ను, ఇమేజ్ ఫార్మాట్‌ను, మరియు కంటైనర్లను పంచుకొనుటకు రిమోట్ రిజిస్ట్రీ ఉపయోగించే అవకాశాన్ని అందిస్తుంది. ఈ విధానంలో అభివృద్దికారులకు మరియు వ్యవస్థ నిర్వాహకులకు ఈ విధమైన లాభాలు చేకూరతాయి:
  • వేగవంతమైన అనువర్తన నియోగం – కంటైనర్స్ అనేవి అనువర్తనం యొక్క కనీసపు రన్‌టైమ్ అవసరాలను కలిగివుండి, వాటి పరిమాణం తగ్గిస్తూ అవి త్వరగా నియోగించబడటానికి దోహదపడతాయి.
  • వివిధ మిషన్లనందు ఇమడగలగటం – లైనక్స్ కెర్నల్ యొక్క హోస్ట్ వర్షన్, ప్లాట్‌ఫాం డిస్ట్రిబ్యూషన్, లేదా డిప్లోయ్‌మెంట్ మోడల్ వీటన్నిటిపైన ఆధారపడకుండా, ఒక అనువర్తనాన్ని మరియు దాని అన్ని డిపెండెన్సీలను ఒకే కంటైనర్ లోపల కట్ట కట్టవచ్చు. ఆ కంటైనర్‌ను డాకర్ నడిపే వేరే మిషన్‌కు బదిలీచేసి, ఏ కంపాటబిలిటీ సమస్యలూ లేకుండా ఎగ్జిక్యూట్ చేయవచ్చు.
  • వర్షన్ కంట్రోల్ మరియు కాంపోనెంట్ రీయూజ్ – మీరు కంటైనర్ యొక్క వరుస వర్షన్లను చూడవచ్చు, తేడాలను పరిశీలించవచ్చు, లేదా గత వర్షన్లకు రోల్-బాక్ చేయవచ్చు. కంటైనర్లు ముందలి లేయర్ల నుండి కాంపోనెంట్లను తిరిగి ఉపయోగించును, అలా అవి లైట్‌వెయిట్ కాగలవు.
  • పంచుకొనుట – మీ కంటైనర్లను ఇతరులతో పంచుకొనుటకు మీరు రిమోట్ రిపోజిటరీ ఉపయోగించవచ్చు. ఈ ప్రయోజనం కొరకు Red Hat ఒక రిజిస్ట్రీ అందిస్తుంది, మరియు మీరు మీ స్వంత వ్యక్తిగత రిపోజిటరీ కూడా చేసుకోవచ్చు.
  • లైట్‌వెయిట్ ఫుట్‌ప్రింట్ మరియు మాన్యువల్ ఓవర్‌హెడ్ – డాకర్ ఇమేజ్‌లు సాధారణంగా చాలా చిన్నవి, కనుక త్వరితంగా అందించడం కుదురుతుంది మరియు కొత్త అనువర్తనపు కంటైనర్లు నియోగించే సమయం తగ్గిస్తాయి.
  • తేలికైన నిర్వహణ – అనువర్తనపు డిపెండెన్సీలతో గల సమస్యలు మరియు ప్రయాసను డాకర్ తగ్గిస్తుంది.

10.3. వర్చ్యువల్ మిషన్లతో పోలిక

వర్చ్యువల్ మిషన్లు మొత్తం సర్వర్‌ను సంబందిత సాఫ్ట్‌వేర్ మరియు నిర్వహణ అవసరాలతో కలిగివుంటాయి. డాకర్ అప్లికేషన్ ఐసోలేషన్‌ను కనీసపు రన్-టైమ్ ఎన్విరాన్మెంట్లతో ఆకృతీకరించవచ్చు. డాకర్ కంటైనర్ నందు, కెర్నల్ మరియు ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క విభాగాలు పంచుకోబడును. వర్చ్యువల్ మిషన్ కొరకు, పూర్తి ఆపరేటింగ్ సిస్టమ్ కలిగివుండాలి.
  • మీరు కంటైనర్లను త్వరితంగా మరియు సులువుగా సృష్టించవచ్చు లేదా తొలగించవచ్చు. వర్చ్యువల్ మిషన్లకు పూర్తి సంస్థాపనలు అవసరం మరియు నడపడానికి ఎక్కువ కంప్యూటింగ్ వనరులు అవసరం.
  • కంటైనర్లు తేలికైనవి, కనుక, వర్చ్యువల్ మిషన్ల కన్నా ఎక్కువ కంటైనర్లను ఒకే హోస్ట్ మిషన్‌పైన ఒకేసారి నడుపవచ్చు.
  • కంటైనర్లు వనరులను సమర్ధవంతంగా పంచుకుంటాయి. వర్చ్యువల్ మిషన్లు విడిగావుంటాయి. కనుక ఒకే అనువర్తనం యొక్క పలు రకాలు నడూస్తుూవున్న కంటైనర్లు కూడా తేలికపాటివై ఉంటాయి. ఉదాహరణకు, వ్యవస్థపైన షేర్డ్ బైనరీలు నకిలీలను కలిగివుండవు.
  • వర్చ్యువల్ మిషన్లు నడుస్తూ ఉన్నప్పుడు కూడా మైగ్రేట్ చేయవచ్చు. కాకుంటే కంటైనర్లు నడుస్తూ ఉన్నప్పుడు మైగ్రేట్ చేయలేము వాటిని ఒక హోస్ట్ మిషన్‌నుండి వేరొక హోస్ట్ మిషన్‌కు కదుల్చునప్పుడు తప్పకుండా ఆపివేయాలి.
అన్ని సందర్భాలలో కంటైనర్లు వర్చ్యవల్ మిషన్లకు ప్రత్యామ్నాయాలు కాదు. మీ అనువర్తనానికి ఏది మంచిదో జాగ్రత్తగా అంచనా వేసుకోవాలి.
డాకర్ కంటైనర్స్ త్వరితంగా అప్ అయ్యి నడుచుటకు, Get Started with Docker Containers చూడండి.
లైనక్స్ కంటైనర్స్, డాకర్, సబ్‌స్క్రిప్షన్స్ మరియు తోడ్పాటు గురించి ‌Docker FAQ మరింత సమాచారం కలిగివుంది.

10.4. Red Hat Enterprise Linux 7.1 పై డాకర్ ఉపయోగించుట

Docker, Kubernetes, మరియు Docker Registry అనేవి Red Hat Enterprise Linux నందు Extras channel లో ఒక భాగంగా విడుదలైను. ఒకసారి Extras channel చేతనమైతే, ప్యాకేజీలు మామూలుగానే సంస్థాపించుకోవచ్చును. ప్యాకేజీలు సంస్థాపించుకోవడం లేదా చానల్స్ చేతనించడంపై మరింత సమాచారం కొరకు, System Administrator's Guide చూడండి.
సర్టిఫైడ్ డాకర్ ఇమేజెస్ యొక్క రిజిస్ట్రీను Red Hat అందిస్తుంది. ఈ రిజిస్ట్రీ అనునది బేస్ ఇమేజ్‌లను Red Hat Enterprise Linux 6 మరియు Red Hat Enterprise Linux 7 రెంటిపైనా అనువర్తనాలను నిర్మించుటకు అందిస్తుంది మరియు ప్రి-బిల్డ్ పరిష్కారాలు Red Hat Enterprise Linux 7.1 పై డాకర్‌తో ఉపయోగించవచ్చు. రిజిస్ట్రీ మరియు అందుబాటులోని ప్యాకేజీల జాబితా పై మరింత సమాచారం కొరకు, Docker Images చూడండి.

అధ్యాయము 11. ధృవీకరణ మరియు ఇంటరాపరబిలిటి

మానవీయంగా బ్యాకప్ మరియు రిస్టోర్ ఫంక్షనాలిటీ

ఐడెంటిటీ మానేజ్‌మెంట్ (IdM) కొరకు ఈ నవీకరణ ipa-backup మరియు ipa-restore ఆదేశాలను అందిస్తోంది, వీటితో వాడుకరులు వారి హార్డ్‌వేర్ విఫలమైనప్పుడు వారి IdM డాటాను బ్యాకప్ తీసుకొని రీస్టోర్ చేసుకొనవచ్చు. మరింత సమాచారం కొరకు, ipa-backup(1) మరియు ipa-restore(1) మాన్యువల్ పేజీలను చూడండి లేదా సంబందిత FreeIPA పత్రీకరణ చూడండి.

సర్టిఫికేట్ అథారిటీ మేనేజ్‌మెంట్ టూల్

ipa-cacert-manage renew ఆదేశం ఐడెంటిటీ మెనేజ్‌మెంట్ (IdM) క్లైంట్‌కు జతచేయబడింది, దానివలన IdM సర్టిఫికేట్ అథారిటీ (CA) ఫైల్ రెన్యూ చేయుటకు వీలవుతుంది. బాహ్య CA ద్వారా సంతకం చేయబడిన ధృవీకరణపత్రం ఉపయోగించి IdM సంస్థాపించి అమర్చగల్గేట్లు ఇది వాడుకరులను చేయును. ఈ విశేషణంపై సమాచారం కొరకు, ipa-cacert-manage(1) మాన్యువల్ పేజీ లేదా సంబందిత FreeIPA పత్రీకరణ చూడండి.

ఇంక్రీజ్డ్ ఏక్సెస్ కంట్రోల్ గ్రాన్యులారిటి

ఐడెంటిటీ మానేజ్‌మెంట్ (IdM) సర్వర్ UI నందలి ఫలానా విభాగాల రీడ్ పర్మిషన్లను క్రమబద్ధీకరించును. ఎంచుకొనిన వాడుకరులకు మాత్రమే ప్రివిలైజ్డ్ కాంటెంట్ యొక్క అందుబాటును పరిమితం చేయుటకు ఇది IdM సేవిక నిర్వాహకులను అనుమతించును. అదనంగా, IdM సేవిక వాడుకరులు ఇకపై అప్రమేయంగా దాని కాంటెంట్లను చదువగల్గే అనుమతులు కలిగివుండరు. ఈ మార్పులు IdM సేవిక డేటా యొక్క మొత్తం రక్షణను మెరుగుపరచును. మరిన్ని వివరాల కొరకు, సంబందిత FreeIPA పత్రీకరణ చూడండి.

అనుమతిలేని వాడుకరుల కొరకు పరిమిత డొమైన్ ఏక్సెస్

domains= ఐచ్చికం pam_sss మాడ్యూల్ కు జతచేయబడెను, అది domains= ఐచ్చికాన్ని /etc/sssd/sssd.conf ఫైల్ నందు ఓవర్‌రైడ్ చేయును. అదనంగా, ఈ నవీకరణ pam_trusted_users ఐచ్చికం జతచేయును, అది వాడుకరులు సంఖ్యా UIDల జాబితాను లేదా వాడుకరి పేర్లను జతచేయుటకు అనుమతిచ్చును అవి SSSD డీమన్ చేత నమ్మబడినవి, మరియు pam_public_domains ఐచ్చికం జతచేయును మరియు నమ్మదగని వాడుకరులకు కూడా అందుబాటులోవుండు డొమైన్లు. తెలిపిన చేర్పులు వ్యవస్థల ఆకృతీకరణను అనుమతించును, ఏక్కడైతే సాధారణ వాడుకరులు తెలిపిన అనువర్తనాలను ఏక్సెస్ చేయుటకు అనుమతించబడి, సిస్టమ్‌పై లాగిన్ అడుటకు హక్కు కలిగివుండరు. మరింత సమాచారం కొరకు, సంబందిత SSSD పత్రీకరణ చూడండి.

కామన్ ఇంటర్నెట్ ఫైల్ సిస్టమ్ కొరకు SSSD ఇంటిగ్రేషన్

cifs-utils సౌలభ్యం ID-మాపింగ్ ప్రోసెస్ చేపట్టే మార్గాన్ని ఆకృతీకరించుటకు SSSD చేత అందించబడిన చొప్పింత ఇంటర్ఫేస్ జతచేయబడింది. ఫలితంగా, Winbind సేవను నడుపుతున్న క్లైంట్ వలెనే SSSD క్లైంట్ కూడా ఇప్పుడు CIFS భాగస్వామ్యాన్ని ఏక్సెస్ చేయగలదు. మరింత సమాచారం కొరకు, సంబందిత SSSD పత్రీకరణ చూడండి.

WinSync నుండి Trust కు మైగ్రేషన్ తోడ్పాటు

ఈ నవీకరణ కొత్త ID Views మెకానిజం యొక్క వాడుకరి ఆకృతీకరణను అందించును. ఇది ఐడెంటిటీ మెనేజ్‌మెంట్ వాడుకరుల మైగ్రేషన్‌ను Active Directory ఉపయోగించే సింక్రోనైజ్డ్-ఆధారిత ఆకృతి WinSync నుండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆధారిత క్రాస్-రీయాల్మ్ నమ్మకాలకు మార్చును. ID Views యొక్క వివరాలు మరియు మైగ్రేషన్ విధానం వివరాల కొరకు, సంబందిత FreeIPA పత్రీకరణ చూడండి.

స్వయంచాలక డేటా ప్రొవైడర్ ఆకృతీకరణ

ipa-client-install కమాండ్ ఇప్పుడు అప్రమేయంగా SSSD ను sudo సేవ కొరకు డేటా ప్రొవైడర్‌గా ఆకృతీకరించును. --no-sudo ఐచ్చికం ఉపయోగించి ఈ ప్రవర్తన ఆచేతనించవచ్చు. అదనంగా, ఐడెంటిటీ మైనేజ్‌మెంట్ క్లైంట్ సంస్థాపన కొరకు NIS డొమైన్ పేరు తెలుపుటకు --nisdomain ఐచ్చికం జతచేయబడెను, మరియు NIS డొమైన్ పేరు అమర్పును తప్పించుటకు --no_nisdomain ఐచ్చికం జతచేయబడెను. ఈ ఐచ్చికాలలో ఏదీ ఉపయోగించకపోతే, IPA డొమైన్ ఉపయోగించబడును.

AD మరియు LDAP సూడో ప్రొవైడర్స్ ఉపయోగం

AD ప్రొవైడర్ అనునది ఒక బ్యాకెండ్ అది ఏక్టివ్ డైరెక్టరీ కు అనుసంధానమగుటకు ఉపయోగించబడును. Red Hat Enterprise Linux  7.1 నందు, LDAP ప్రొవైడర్‌తో కలిపి AD సూడో ప్రొవైడర్‌ను ఉపయోగించుట సాంకేతిక ముందస్తు దర్శనంలా తోడ్పాటునీయబడును. AD సూడో ప్రొవైడర్ చేతనం చేయుటకు, sssd.conf ఫైలు డొమైన్ విభాగము నందు sudo_provider=ad అమరికను జతచేయుము.

అధ్యాయము 12. రక్షణ

SCAP రక్షమ మార్గదర్శని

Red Hat Enterprise Linux 7.1 నందు రక్షణ మార్గదర్శనం, సూత్రాలు, మరియు సంబందిత అంచనా పద్ధతులు అందించుటకు scap-security-guide ప్యాకేజీ చేర్చబడింది. మార్గదర్శనం Security Content Automation Protocol (SCAP) నందు తెలుపబడెను, అది ప్రయోగాత్మక పటిష్ఠ సూచనా వివరంను కలిగివుంటుంది. నిర్దేశిత రక్షణ విధాన అవసరాల మేరకు సిస్టమ్ సెక్యూరిటీ కంప్లయన్స్ జరిపించుటకు SCAP Security Guide అవసరమైన డేటాను కలిగివుంటుంది; వ్రాతపూర్వక వివరణ మరియు స్వయంచాలన పరీక్ష (probe) రెండూ చేర్చబడెను. పరీక్షను స్వయంచాలనం చేయడం ద్వారా, సిస్టమ్ కంప్లయన్స్ రోజువారీ నిర్ధారించుటకు SCAP Security Guide అనువైన మరియు విశ్వసనీయమైన మార్గాన్ని అందించును.
Red Hat Enterprise Linux 7.1 వ్యవస్థ నిర్వాహకులు openscap-utils ప్యాకేజీ అందించు oscap కమాండ్ లైన్ సాధనం ఉపయోగించి నిర్దేశిత మార్గదర్శనాల మేరకు వ్యవస్థ అనుసరిస్తోందేమో నిర్ధారించగలరు. మరింత సమాచారం కొరకు scap-security-guide(8) మాన్యువల్ పేజీ చూడండి.

SELinux విధానం

Red Hat Enterprise Linux 7.1 నందు, SELinux విధానం సవరించబడింది; గతంలో init_t డొమైన్ నందు నడిచే స్వంత SELinux విధానం లేని సేవలు ఇప్పుడు కొత్తగా జతచేసిన unconfined_service_t డొమైన్ నందు నడుచును. Red Hat Enterprise Linux 7.1 కొరకు Unconfined Processes అధ్యాయం SELinux User's and Administrator's Guide నందు చూడండి.

OpenSSH నందు కొత్త విశేషణాలు

OpenSSH సాధనాల సమితి వర్షన్ 6.6.1p1 కు నవీకరించబడెను, అది క్రిప్టోగ్రఫీకు చెందిన చాలా కొత్త విశేషణాలను జతచేయును:
  • డానియల్ బెర్న్‌స్టైన్ Curve25519 నందలి ఎలిప్టిక్-కర్వ్ Diffie-Hellman ఉపయోగించి కీ మార్పిడి. ఈ పద్దతి ఇప్పుడు సర్వర్ మరియు క్లైంట్ రెంటినందు అప్రమేయంగా తోడ్పాటునీయబడును.
  • Ed25519 ఎలిప్టిక్-కర్వ్ సిగ్నేచర్ స్కీమ్‌ను పబ్లిక్ కీ రకంగా ఉపయోగించుటకు తోడ్పాటు జతచేయబడింది. Ed25519, అది యూజర్ మరియు హోస్ట్ కీలు రెంటికీ ఉపయోగించవచ్చు, అది ECDSA మరియు DSA రెంటికన్నా ఉత్తమ రక్షణను మరియు పనితనం అందించును.
  • bcrypt కీ-డెరివేషన్ ఫంక్షన్ (KDF) ఉపయోగించే కొత్త ప్రైవేట్-కీ ఫార్మాట్ జతచేయబడింది. అప్రమేయంగా, ఈ ఫార్మాట్ Ed25519 కీల కొరకు ఉపయోగించబడును అయితే ఇతర కీ రకాల కొరకు కూడా కోరబడవచ్చు.
  • కొత్త ట్రాన్స్‌పోర్ట్ సైఫర్, chacha20-poly1305@openssh.com, జతచేయబడింది. అది డానియల్ బెర్న్‌సైన్ ChaCha20 స్ట్రీమ్ సైఫర్‌ను మరియు Poly1305 మెసేజ్ అథెంటికేషన్ కోడ్ (MAC)ను కలుపును.

Libreswan నందు కొత్త విశేషణాలు

Libreswan ఇంప్లిమెంటేషన్ IPsec VPN వర్షన్ 3.12 కు నవీకరించబడెను, అది చాలా కొత్త విశేషణాలను మరియు మెరుగుదలలను అందించును:
  • కొత్త సైఫర్లు జతచేయబడెను.
  • IKEv2 తోడ్పాటు మెరుగుపరచబడెను (ముఖ్యంగా CP పేలోడ్స్, CREATE_CHILD_SA అభ్యర్దనలు, మరియు కొత్తగా వచ్చినAuthenticated Header (AH దృష్ట్యా).
  • IKEv1 మరియు IKEv2 నందు ఇంటర్మీడియరీ సర్టిఫికేట్ చైన్ తోడ్పాటు జతచేయబడెను.
  • అనుసంధాన సంభాలన మెరుగుపరచబడెను.
  • OpenBSD, Cisco, మరియు Android systems తో ఇంటరాపరబిలిటీ మెరుగుపరచబడింది.
  • systemd తోడ్పాటు మెరుగుపరచబడింది.
  • హాష్‌డ్ CERTREQ మరియు ట్రాఫిక్ గణాంకాల కొరకు తోడ్పాటు జతచేయబడింది.

TNC నందు కొత్త విశేషణాలు

ట్రస్టెడ్ నెట్వర్క్ కనెక్ట్ (TNC) ఆకృతి strongimcv ప్యాకేజీ ద్వారా అందించబడినది, నవీకరించబడెను మరియు ఇప్పుడు strongSwan 5.2.0 పై ఆధారపడును. కింది కొత్త విశేషణాలు మరియు మెరుగుదలలు TNC కు జతచేయబడెను:
  • విశ్వసనీయ నెట్వర్క్ అనుసంధానత కొరకు PT-EAP ట్రాన్స్‌పోర్ట్ ప్రొటోకాల్ (RFC 7171).
  • అటెస్టేషన్ IMC/IMV జత ఇప్పుడు IMA-NG మెజర్‌మెంట్ ఫార్మాట్‌కు తోడ్పాటునిచ్చును.
  • అటెస్టేషన్ IMV తోడ్పాటు ఇప్పుడు కొత్త TPMRA వర్క్ ఐటమ్ ఇంప్లిమెంటేషన్‌తో మెరుగుపరచబడెను.
  • JSON-based REST API with SWID IMV కు తోడ్పాటు జతచేయబడెను.
  • SWID IMC అనేది అన్ని సంస్థాపిత ప్యాకేజీలను dpkg, rpm, లేదా pacman ప్యాకేజీ నిర్వాహికలనుండి swidGenerator ఉపయోగించి ఎక్స్‌ట్రాక్ట్ చేయగలదు, అది ISO/IEC 19770-2:2014 ప్రమాణం ప్రకారం SWID టాగ్స్ పుట్టించును.
  • EAP-(T)TLS మరియు ఇతర ప్రొటోకాల్స్ చేత ఉపయోగించబడే libtls TLS 1.2 ఇంప్లిమెంటేషన్ AEAD రీతి తోడ్పాటుచే విస్తరించబడెను, ప్రస్తుతం AES-GCM కు పరిమితమైను.
  • aikgen సాధనం ఇప్పుడు TPMకు బౌండయ్యే అటెస్టేషన్ ఐడెంటిటీ కీ పుట్టించును.
  • కామన్ imv_session ఆబ్జక్ట్ ద్వారా ఏక్సెస్ రిక్వెస్టార్ యొక్క ఎక్సెస్ రిక్వెస్టార్ ఐడి, డివైజ్ ఐడి, మరియు ప్రొడక్ట్ సమాచారం పంచుకొనుటకు మెరుగైన IMVల తోడ్పాటు.
  • IF-TNCCS (PB-TNC, IF-M (PA-TNC)) ప్రొటోకాల్స్, మరియు OS IMC/IMV జతనందు చాలా బగ్‌లు పరిష్కరించబడినాయి.

GnuTLS నందు కొత్త విశేషణాలు

SSL, TLS, మరియు DTLS ప్రొటోకాల్స్ యొక్క GnuTLS ఇంప్లిమెంటేషన్ వర్షన్ 3.3.8 కు నవీకరించబడెను, అది చాలా కొత్త విశేషణాలను మరియు మెరుగుదలలను అందించును:
  • DTLS 1.2 కు తోడ్పాటు జతచేయబడెను.
  • Application Layer Protocol Negotiation (ALPN) కు తోడ్పాటు జతచేయబడెను.
  • ఎల్లిప్టిక్ట్-కర్వ్ సైఫర్ సూట్స్ పనితనం మెరుగుపరచబడెను.
  • కొత్త సైఫర్ సూట్స్, RSA-PSK మరియు CAMELLIA-GCM, జతచేయబడెను.
  • Trusted Platform Module (TPM) ప్రమాణానికి స్వాభావిక తోడ్పాటు జతచేయబడెను.
  • PKCS#11 స్మార్ట్ కార్డ్స్ మరియు hardware security modules (HSM) కొరకు తోడ్పాటు చాలా మార్గాలలో మెరుగుపరచబడెను.
  • FIPS 140 రక్షణ ప్రమాణాలతో కంప్లయెన్స్ (ఫెడరల్ ఇన్ఫర్మేషన్ ప్రోసెసింగ్ స్టాన్డర్డ్స్) చాలా విధాలుగా మెరుగైను.

అధ్యాయము 13. డెస్క్‌టాప్

క్వాడ్-బఫర్డ్ OpenGL స్టీరియో విజువల్స్ కొరకు తోడ్పాటు

తోడ్పాటునిచ్చు హార్డ్‌వేర్ పైన క్వాడ్-బఫర్డ్ OpenGL స్టీరియో విజువల్స్ ఉపయోగించుటకు GNOME Shell మరియు Mutter కంపోజిటింగ్ విండో మేనేజర్ ఇప్పుడు మిమ్ములను అనుమతించును. మీరు NVIDIA డిస్ప్లే డ్రైవర్ వర్షన్ 337 లేదా తరువాతది కలిగివుండాలి ఈ విశేషణాన్ని సరిగా ఉపయోగించుటకు.

ఆన్‌లైన్ ఖాతా అందించువారు

కొత్త GSettings కీ org.gnome.online-accounts.whitelisted-providers అనేది GNOME Online Accounts (gnome-online-accounts ప్యాకేజీ ద్వారా అందించబడింది)కు జతచేయబడెను. ప్రారంభంనందు లోడగుటకు బాహ్యంగా అనుమతించబడిన ఆన్‌లైన్ ఖాతా అందించువారి జాబితాను ఈ కీ అందించును. ఈ కీ తెలుపుట ద్వారా, సిస్టమ్ నిర్వహణాధికారులు సరైన ఉత్పాదకులను చేతనించగలరు లేదా మిగతావారిని ఎంపికద్వారా అచేతనించగలరు.

అధ్యాయము 14. మద్దతు మరియు నిర్వహణ

ABRT ధృవీకృత మైక్రో-రిపోర్టింగ్

Red Hat Enterprise Linux 7.1 నందు, Automatic Bug Reporting Tool (ABRT) అనేది Red Hat వినియోగదారి పోర్టల్‌తో అవినాభావ సంబందం కలిగివుంది మరియు నేరుగా పోర్టల్‌కు మైక్రో-రిపోర్ట్స్ పంపగల సామర్ధ్యం కలిగివుంది. దీనితో ABRT వాడుకరులకు క్రాష్ నివేదికలు అందించగల్గుతుంది. అదనంగా, ABRT ఎన్టైటిల్మెంట్ సర్టిఫికేట్లను లేదా మైక్రో-రిపోర్ట్స్ ధృవీకరించుటకు పోర్టల్ క్రెడెన్షియల్స్ ఉపయోగించగల ఐచ్చికం కలిగివుంది, అది ఈ విశేషణం ఆకృతీకరణను సులభతరం చేస్తుంది.
ఇంటిగ్రేటెడ్ ధృవీకరణ అనునది ABRT ను మైక్రో-రిపోర్ట్‌కు రిచ్ టెక్స్ట్‌తో ప్రత్యుత్తరం ఇచ్చుటకు అనుమతించును అది మైక్రో-రిపోర్ట్ నందలి కారణం పరిష్కారానికి సూచనలు కలిగివుండవచ్చు. మైక్రో-రిపోర్ట్స్ కు చెందిన ముఖ్యమైన నవీకరణల గురించిన ప్రకటనలు చేతనించుటకు కూడా ధృవీకరణ ఉపయోగించవచ్చు, మరియు ఈ ప్రకటనలు నేరుగా నిర్వాహకులకు తెలుపవచ్చు.
Red Hat Enterprise Linux 7.0 నందు ABRT మైక్రో-రిపోర్ట్స్ ను చేతనపరచిన వినియోగదారులకు అధికారిక మైక్రో-రిపోర్టింగ్ స్వయంచాలకంగా చేతనించబడునని గమనించండి.
ఈ విశేషణంపై మరింత సమాచారం కొరకు వినియోగదారి పోర్టల్ చూడండి.

అధ్యాయము 15. Red Hat సాఫ్ట్‌వేర్ సంకలనాలు

Red Hat సాఫ్ట్‌వేర్ సంకలనాలు అనగా Red Hat అందిచే డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, డాటాబేస్ సర్వర్స్, మరియు సంబందిత ప్యాకేజీలు. వీటిని మీరు AMD64 మరియు Intel 64 ఆకృతులపై Red Hat Enterprise Linux 6 మరియు Red Hat Enterprise Linux 7 విడుదలలో సంస్థాపించి ఉపయోగించవచ్చు.
Red Hat సాఫ్ట్‌వేర్ సంకలనాలతో పంపిణీచేసే డైనమిక్ లాంగ్వేజెస్, డాటాబేస్ సర్వర్స్, మరియు ఇతర సాధనాలు Red Hat Enterprise Linux అందించు అప్రమేయ వ్యవస్థ సాధనాలను కప్పిపుచ్చవు, లేక ఈ సాధనాల అభీష్టానుసారం ఉపయోగించబడవు.
Red Hat సాఫ్ట్‌వేర్ సంకలనాలు ప్రత్యామ్నాయ ప్యాకేజింగ్ మెకానిజంను scl ఉపలభ్యంపై ఆధారపడి ఉపయోగించి సమాంతర ప్యాకేజీల సమితిని అందించును. ఈ సమితి ప్రత్యామ్నాయ ప్యాకేజీ వర్షన్ల వినియోగాన్ని Red Hat Enterprise Linux పై చేతనించును. scl ఉపలభ్యం ఉపయోగించి, ఏ ప్యాకేజీ వర్షన్‌ను వారు నడపాలనుకుంటున్నారో వాడుకరులు ఎంచుకోవచ్చు.

ముఖ్యమైన

Red Hat సాఫ్ట్‌వేర్ సంకలనాలు తక్కువ లైఫ్‌ సైకిల్ మరియు తోడ్పాటు వ్యవధి కలిగివుంటాయి Red Hat Enterprise Linux తో పోల్చితే. మరింత సమాచారం కొరకు, Red Hat Software Collections Product Life Cycle చూడండి.
Red Hat డెవలప్పర్ టూల్‌సెట్ ఇప్పుడు Red Hat సాఫ్ట్‌వేర్ సంకలనాలలో భాగం, ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సంకలనంగా చేర్చబడెను. Red Hat డెవలప్పర్ టూల్‌సెట్ అనునది Red Hat Enterprise Linux ప్లాట్‌ఫాం పైన పనిచేసే డెవలప్పర్స్ కొరకు రూపొందించబడింది. అది GNU Compiler Collection, GNU Debugger, Eclipse development platform, మరియు ఇతర డెవలప్‌మెంట్, డీబగ్గింగ్, మరియు పర్ఫార్మెన్స్ మానిటరింగ్ టూల్స్ యొక్క ప్రస్తుత వర్షన్లను అందించును.
సమితినందు చేర్చిన మూలకాల కొరకు, వ్యవస్థ అవసరాల కొరకు, తెలిసిన సమస్యల గురించి, వాడుక గురించి, మరియు ఒంటరి సాఫ్ట్‌వేర్ సంకలనాల వివరాల గురించి తెలుసుకొనుటకు, Red Hat Software Collections documentation చూడండి.
ఈ సాఫ్ట్‌వేర్ సంకలనం నందు చేర్చిన కాంపోనెంట్స్ గురించి, సంస్థాపన, వినియోగం, తెలిసిన సమస్యలు, మరియు మరిన్నిటి గురించి తెలుసుకొనుటకు Red Hat Developer Toolset documentation చూడండి.

భాగము II. పరికర డ్రైవర్లు

ఈ అధ్యాయం Red Hat Enterprise Linux 7.1 నందు నవీకరించిన పరికర డ్రైవర్ల జాబితాను అందించును.

అధ్యాయము 16. నిల్వ డ్రైవర్ నవీకరణలు

  • hpsa డ్రైవర్ 3.4.4-1-RH1 కు నవీకరించబడెను.
  • qla2xxx డ్రైవర్ వర్షన్ 8.07.00.08.07.1-k1 కు నవీకరించబడెను.
  • qla4xxx డ్రైవర్ వర్షన్ 5.04.00.04.07.01-k0 కు నవీకరించబడెను.
  • qlcnic డ్రైవర్ వర్షన్ 5.3.61 కు నవీకరించబడెను.
  • netxen_nic డ్రైవర్ వర్షన్ 4.0.82 కు నవీకరించబడెను.
  • qlge డ్రైవర్ వర్షన్ 1.00.00.34 కు నవీకరించబడెను
  • bnx2fc డ్రైవర్ వర్షన్ 2.4.2 కు నవీకరించబడెను.
  • bnx2i డ్రైవర్ వర్షన్ 2.7.10.1 కు నవీకరించబడెను.
  • cnic డ్రైవర్ వర్షన్ 2.5.20 కు నవీకరించబడెను.
  • bnx2x డ్రైవర్ వర్షన్ 1.710.51-0 కు నవీకరించబడెను.
  • bnx2 డ్రైవర్ వర్షన్ 2.2.5 కు నవీకరించబడెను.
  • megaraid_sas డ్రైవర్ వర్షన్ 06.805.06.01-rc1 కు నవీకరించబడెను.
  • mpt2sas డ్రైవర్ వర్షన్ 18.100.00.00 కు నవీకరించబడెను.
  • ipr డ్రైవర్ వర్షన్ 2.6.0 కు నవీకరించబడెను.
  • kmod-lpfc ప్యాకేజీలు Red Hat Enterprise Linux 7కు జతచేయబడెను, అది lpfc డ్రైవర్ Fibre Channel (FC) మరియు Fibre Channel over Ethernet (FCoE) ఎడాప్టర్లతో ఉపయోగించునప్పుడు అత్యంత స్థిరత్వం కలిగివుంటుంది. lpfc డ్రైవర్ వర్షన్ 0:10.2.8021.1 కు నవీకరించెను.
  • be2iscsi డ్రైవర్ వర్షన్ 10.4.74.0r కు నవీకరించెను.
  • nvme డ్రైవర్ వర్షన్ 0.9 కు నవీకరించెను.

అధ్యాయము 17. నెట్వర్క్ డ్రైవర్ నవీకరణలు

  • bna డ్రైవర్ వర్షన్ 3.2.23.0r కు నవీకరించెను.
  • cxgb3 డ్రైవర్ వర్షన్ 1.1.5-ko కు నవీకరించెను.
  • cxgb3i డ్రైవర్ వర్షన్ 2.0.0 కు నవీకరించెను.
  • iw_cxgb3 డ్రైవర్ వర్షన్ 1.1 కు నవీకరించెను.
  • cxgb4 డ్రైవర్ వర్షన్ 2.0.0-ko కు నవీకరించెను.
  • cxgb4vf డ్రైవర్ వర్షన్ 2.0.0-ko కు నవీకరించెను.
  • cxgb4i డ్రైవర్ వర్షన్ 0.9.4 కు నవీకరించెను.
  • iw_cxgb4 డ్రైవర్ వర్షన్ 0.1 కు నవీకరించెను.
  • e1000e డ్రైవర్ వర్షన్ 2.3.2-k కు నవీకరించెను.
  • igb డ్రైవర్ వర్షన్ 5.2.13-k కు నవీకరించెను
  • igbvf డ్రైవర్ వర్షన్ 2.0.2-k కు నవీకరించెను.
  • ixgbe డ్రైవర్ వర్షన్ 3.19.1-k కు నవీకరించెను.
  • ixgbevf డ్రైవర్ వర్షన్ 2.12.1-k కు నవీకరించెను.
  • i40e డ్రైవర్ వర్షన్ 1.0.11-k కు నవీకరించెను.
  • i40evf డ్రైవర్ వర్షన్ 1.0.1 కు నవీకరించెను.
  • e1000 డ్రైవర్ వర్షన్ 7.3.21-k8-NAPI కు నవీకరించెను.
  • mlx4_en డ్రైవర్ వర్షన్ 2.2-1 కు నవీకరించెను.
  • mlx4_ib డ్రైవర్ వర్షన్ 2.2-1 కు నవీకరించెను.
  • mlx5_core డ్రైవర్ వర్షన్ 2.2-1 కు నవీకరించెను.
  • mlx5_ib డ్రైవర్ వర్షన్ 2.2-1 కు నవీకరించెను.
  • ocrdma డ్రైవర్ వర్షన్ 10.2.287.0u కు నవీకరించబడెను.
  • ib_ipoib డ్రైవర్ వర్షన్ 1.0.0 కు నవీకరించబడెను.
  • ib_qib డ్రైవర్ వర్షన్ 1.11 కు నవీకరించబడెను.
  • enic డ్రైవర్ వర్షన్ 2.1.1.67 కు నవీకరించబడెను.
  • be2net డ్రైవర్ వర్షన్ 10.4r కు నవీకరించబడెను.
  • tg3 డ్రైవర్ వర్షన్ 3.137 కు నవీకరించబడెను.
  • r8169 డ్రైవర్ వర్షన్ 2.3LK-NAPI కు నవీకరించును.

అధ్యాయము 18. గ్రాఫిక్స్ డ్రైవర్ నవీకరణలు

  • vmwgfx డ్రైవర్ వర్షన్ 2.6.0.0 కు నవీకరించు.

పునఃపరిశీలన చరిత్ర

పునఃపరిశీలన చరిత్ర
పునఃపరిశీలన 1.0-9Wed Jan 14 2015Milan Navrátil
Red Hat Enterprise Linux 7.1 విడుదల నోట్స్ విడుదల.
పునఃపరిశీలన 1.0-9Wed Jan 14 2015Milan Navrátil
Release of the Red Hat Enterprise Linux 7.1 Release Notes.
పునఃపరిశీలన 1.0-8Thu Dec 15 2014Jiří Herrmann
Red Hat Enterprise Linux 7.1 బీటా విడుదల నోట్స్ విడుదల.
పునఃపరిశీలన 1.0-8Thu Dec 15 2014Jiří Herrmann
Release of the Red Hat Enterprise Linux 7.1 Beta Release Notes.